భార్యపై బీజేపి ఎమ్మెల్యే కాల్పులు.. పరారీ BJP 'leader' shoots wife to death, flees

Bjp leader kuldeep tomar shoots dead wife after argument

kuldeep tomar, bjp leader shoots wife, up bjp leader shoots wife in meerut, leader shoot wife in meerut, bjp leader shoots wide in up, mla on the run, crime

A Meerut BJP leader allegedly shot his wife after a heated argument, who later succumbed to her injuries in hospital. Poonam, his wife, was seriously injured and was taken to a hospital.

భార్యపై బీజేపి ఎమ్మెల్యే కాల్పులు.. పరారీ

Posted: 02/19/2017 11:22 AM IST
Bjp leader kuldeep tomar shoots dead wife after argument

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికల నేపథ్యంలో అక్కడ అభ్యర్థులంతా ముమ్మర ప్రచారంలో పాల్గొని తమ గెలుపుకోసం శ్రమిస్తున్నారు. ఇక మూడు విడతల ఎన్నికలలో తమ భవిష్యత్తును పరీక్షించుకున్న అభ్యర్థులు మార్చి 11 ఎప్పుడు వస్తుందా..? అంటూ ఎదురుచూస్తున్న తరుణంలో ఓ బీజేపీ ఎమ్మెల్యే మాత్రం అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. తన సహధర్మచారిణితో గొడవపడ్డాు. అది కాస్తా పెద్ద గొడవగా తయారైయ్యే సరికి విఛక్షణ కోల్పోయిన ఎమ్మెల్యే తన తుపాకీ తీసి ఆమెపై కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకునేందుకు సిద్ధపడ్డాడు.

అయితే, ఇంట్లో ఉన్న ఇతరులు అతడి చర్యను అడ్డుకోవడంతో ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. భార్య మాత్రం చనిపోయింది. బీజేపీ నాయకుడు కులదీప్‌ తోమర్‌ తన భార్య పూనమ్‌తో తొలుత గొడవపడ్డాడు. ఆ తర్వాత విపరీతంగా తిట్టుకున్నారు. తొలుత చేయి చేసుకున్న ఆయన అనంతరం తన దగ్గర ఉన్న తుపాకీతో భార్యపై కాల్పులు జరిపాడు. అనంతరం తనకు తుపాకీ ఎక్కుపెట్టుకొని కాల్చుకోబోతుండగా ఇంట్లో మేనళ్లుడు వచ్చి అడ్డుకున్నాడు. పూనమ్‌ను ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే, భార్య చనిపోయిందనే భయంతో ప్రస్తుతం కులదీప్‌ పరారీలో ఉన్నాడు. మొత్తం ఆయన కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles