నటి భావన కిడ్నాప్, అత్యాచారం కేసులో నిందితుల అరెస్టు Malayalam actress molest case, 7 held

Ex driver 6 others held in abduction molestation of kerala actress

malayalam actress, malayalam actress case, malayalam actress bhavana, bhavana molestation, bhavana news, bhavana prithviraj sukumaran, prithviraj sukumaran, malayalam actress prithviraj sukumaran, sayanora philip, prithviraj sukumaran post on malayalam actress, malayalam actress news, malayalam actress reaction, malayalam actress latest news, entertainment news

Seven persons taken into custody in connection with the harassment of a noted South Indian film actress, police said here on Sunday.

నటి భావన కిడ్నాప్, అత్యాచారం కేసులో నిందితుల అరెస్టు

Posted: 02/19/2017 08:28 AM IST
Ex driver 6 others held in abduction molestation of kerala actress

తెలుగులోనూ కొన్ని చిత్రాల్లో నటించిన హీరోయిన్ భావన అత్యాచార కేసులో  పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భావన మాజీ డ్రైవర్ తో ఏర్పడిన వివాదం నేపథ్యంలో ఈ కిడ్నాప్, అత్యాచారం జరగిందన్న విషయాలను  పోలీసులు వెల్లడించారు. గతంలో విభేదాలు వచ్చి ఆమె తీసేసిన డ్రైవర్ సునీల్ కుమార్, పాత పగను మనసులో పెట్టుకుని, రెండు నెలల క్రితమే కిడ్నాప్ ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆమె త్రిసూర్ లో షూటింగ్ లో ఉందని తెలుసుకుని ప్రస్తుత డ్రైవర్ మార్టిన్ తో కలసి ప్లాన్ చేసి కిడ్నాప్ చేశారని తెలిపారు.

శుక్రవారం రాత్రి 9:30 గంటల సమయంలో ఆమె కారులో వెళుతుండగా, టెంపోలో నిందితులు ఫాలో అయ్యారని, నెడుంబాసరే విమానాశ్రయం సమీపంలో ఆమె కారును ఢీకొట్టి కిడ్నాప్ చేశారని తెలిపారు. ఆపై దాదాపు గంటన్నర పాటు ఆమెను బలాత్కరించారని, ఈ కేసులో ఫిర్యాదు అందుకుని ఎర్నాకులం మెడికల్ కాలేజీలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. ఆమెకు స్వల్ప గాయాలు కావడంతో అస్పత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ చేశామన్నారు.

కాగా భావనను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఆరుగురిలో ఇద్దరు డ్రైవర్లు మినహా మిగతావారంతా సినీ ఇండస్ట్రీతో సంబంధాలున్నవారేనని, వీరు పలు ప్రొడక్షన్ ఉద్యోగాలు చేస్తున్నారని కేసును విచారిస్తున్న పోలీసులు తెలిపారు. భావన కిడ్నాప్ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు అడిషనల్ డీజీపీ బీ సంధ్య నేతృత్వంలో దినేంద్ర కస్యప్ ను విచారణ అధికారిగా నియమించగా, కేసులో మరో ఇద్దరిని కోయంబత్తూరులో అరెస్ట్ చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

మొత్తం ఆరుగురికి కేసులో భాగం ఉందని, ఇప్పటివరకూ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. కాగా, ఈ విషయంలో మీడియాతో ఎక్కువగా మాట్లాడవద్దని భావనకు సలహా ఇచ్చామని, సాధ్యమైనంత త్వరగా నిందితులందరినీ అరెస్ట్ చేస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మలయాళం సినీ పరిశ్రమలోని నిందితులకు, బాధితురాలికి మధ్య గతంలో ఉన్న సంబంధాలు చెడిపోవడంతోనే వారు పగబట్టి ఈ కిడ్నాప్ ప్లాన్ చేశారని తెలిపారు. కాగా, రాష్ట్రంలో సెలబ్రిటీలకే రక్షణ లేకుండా పోయిందని కేరళ విపక్ష నేత రమేష్ చెన్నితాల విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles