అసెంబ్లీ నుంచి డీఎంకే సభ్యుల సస్పెన్షన్.. సభ మళ్లీ వాయిదా DMK MLAs expelled, House adjourned till 3 pm

Dmk mlas expelled house adjourned till 3 pm

tamil nadu, palnisamy, paneer selvam, sasikala, chief minister, dhanpak, TN assembly speaker, vidyasagar rao, cabinet minister, stalin, dmk, aiadmk, congress, tamil nadu politics

DMK MLAs begin protests outside the Assembly after being evicted; will sit on dharna inside Assembly premises. Assembly security unable to evict DMK MLAs; Assembly adjourned again till 3 PM

అసెంబ్లీ నుంచి డీఎంకే సభ్యుల సస్పెన్షన్.. సభ మళ్లీ వాయిదా

Posted: 02/18/2017 02:09 PM IST
Dmk mlas expelled house adjourned till 3 pm

తమిళనాడు అసెంబ్లీలో వాయిదాల పర్వం నడుస్తుంది. తొలిసారిగా అరగంట పాటు వాయిదా పడిన తమిళనాడు అసెంబ్లీ మరోమారు వాయిదా పడింది. వాయిదా అనంతరం తన చుట్టూ మార్షల్స్ తో సభను ప్రారంభించేందారు స్పీకర్ ధన్ పాల్. మద్యహ్నాం ఒంటిగంటకు ఆయన సభను తిరిగి ప్రారంభించినా.. సభలో మాత్రం గందరగోళ పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. దీంతో సభ నుంచి డీఎంకే ఎమ్మల్యేలను సస్సెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

అంతకుముందు సభ ప్రారంభంకాగానే తనకు నిండు సభలో అవమానం జరిగిందని స్పీకర్ ధన్ పాల్ అవేదనను వ్యక్తం చేశారు. ‘‘నాపై కుర్చీలు విసిరివేశారు, పేపర్లు చించి నా ముఖాన కొట్టారు.. నా మైక్రోఫోన్ ను విరగోట్టారు.. నా చోక్కాను చించివేశారు. అయినా తాను నిబంధనల ప్రకారమే సభను నడుపుతున్నానని స్పీకర్ ధన్ పాల్ చెప్పారు. సభలోని డీఎంకే సభ్యుల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘నన్ను పట్టుకుని లాగారు ఇది సమంజసమేనా.. స్పీకర్ చైర్ కే విలువను ఇవ్వకపోతే.. సభ ఎలా సాగుతుంది. సభాపతికే సభలో మర్యాద లేదా..?’’ అంటూ అసంతప్తిని వెళ్లగక్కారు.

అయినా సభలో పరిస్థితులు శాంతించలేదు. ఇక తన చాంబర్ లోకి డీఎంకే సభ్యులు దూసుకురాకుండా స్పీకర్ తన చుట్టూ 30 మంది మార్షల్స్ ను ఏర్పాటు చేసుకున్నారు. మార్షల్స్ ను నెట్టుకుంటూ డీఎంకే ఎమ్మెల్యేలు సభలో విశ్వాస పరీక్షను జరగనీయకుండా అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ ధన్ పాల్ సభ నుంచి డీఎంకే సభ్యులను సస్పెండ్ చేశారు. అయితే సభ నుంచి తాము వెళ్లేది లేదని భీష్మించుకు కూర్చున్న డీఎంకే ఎమ్మల్యేలు రాజ్యాంగబద్దంగా రహస్య ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇక చేసేది లేక స్పీకర్ సభను మూడు గంటల వరకు వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles