మద్యం మత్తు.. యువతులు.. మరి కారు ఎటు..? car drove into house in secundrabad

Car drove into house in secundrabad

drunk and drive, young man, young woman, secundrabad ruckus, sardarpatel road, maredpally, youth hulchul with car, drunken man, Secunderabad, crime

intoxicated youth along with two females drove his car into road side house, where there is no casualities but compound wall is fully damaged.

మద్యం మత్తు.. యువతులు.. మరి కారు ఎటు..?

Posted: 02/12/2017 10:24 AM IST
Car drove into house in secundrabad

సికింద్రాబాద్‌లో కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. మద్యం మత్తులో వున్న ఓ యువకుడు.. అతని పక్కనే మరో ఇద్దరు యువతులు కూడా మద్యం మత్తలోనే జోగుతూ.. ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తుంది. ప్రమాదం సంభవించగానే నిందితుడు, ఇద్దరు యువతులతో సహా పలాయనం చిత్తగించినట్లు తెలుస్తుంది. కాగా ప్రమాదంలో ప్రహారీ గోడ పూర్తిగా ధ్వంసం కాగా, కారు కూడా ధ్వంసమైంది. ఈ ఘటన సికింద్రాబాద్ లోని  సర్దార్‌ పటేల్‌ రోడ్డులోని మారేడ్‌పల్లిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

కారు ఇంటి ప్రహారి గోడను ఢీకొని కొద్ది దూరం లోపలికి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఓ యువకుడితో పాటు ఇద్దరు యువతులు ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ప్రమాదం అనంతరం కారు నడిపిన యువకుడితో పాటు యువతులు కారు అక్కడే వదిలి పరారయ్యారు. కారు(కేఏ 51డి 5181) కర్నాటక రాష్ట్రానికి చెందినదిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కారులో మద్యంలో సీసాలు లభించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : drunk and drive  secundrabad  sardarpatel road  maredpally  drunken man  crime  

Other Articles