బీటాలు వారుతున్న చిన్నమ్మ కోట.. సెల్వానికి ఊరట.. Pandiarajan extends support to O. Panneerselvam

Aiadmk mla pandiarajan jumps ship joins panneerselvam camp

O Panneerselvam, VK Sasikala, M Foi Pandiarajan, Pandiarajan, Jayalalithaa, Tamil Nadu, AIADMK, Ashok Kumar, PR Sundaram, Vidya Sagar Rao, PM Modi

Panneerselvam camp got a boost as education minister M Foi Pandiarajan and two Lok Sabha members, Krishnagiri MP Ashok Kumar and Namakkal MP PR Sundaram, joined his camp

బీటాలు వారుతున్న చిన్నమ్మ కోట.. సెల్వానికి ఊరట..

Posted: 02/11/2017 01:19 PM IST
Aiadmk mla pandiarajan jumps ship joins panneerselvam camp

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గం ఊరట పోందుతున్నారు. రాష్ట్రంలో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణలు వారికి భారీ ఊరటనిస్తున్నాయి. కేంద్రం డైరెక్షన్ లోనే అంతా జరుగుతుందన్న వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో సెల్వానికే పన్నీరులాంటి సీఎం పీఠాన్ని అందించాలని తమిళనాడు ప్రజల అకాంక్షతో పాటు అమ్మ ఆశయాల సాధనకు కట్టుబడాలని అన్నాడీఎంకే కు చెందిన నేతలు ఒక్కక్కరుగా పన్నీరుసెల్వానికి మద్దుతును ప్రకటిస్తున్నారు.

అదే సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలన్న శశికళ అశలను అడియాశలుగా మారుస్తూ అమె వర్గానికి చెందిన బలమైన నేత, విధేయుడు మంత్రి పాండ్యరాజన్ ప్లేటు ఇన్నాళ్లు నమ్మినబంటుగా వున్న పన్నీరుసెల్వం.. ఇప్పటికే శశికళపై నేరుగా అరోపణలను గుప్పిస్తూ.. మద్దతును కూడగట్టుకుంటున్న నేపథ్యంలో పలువరు పార్టీ సీనియర్ల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. ఫిరాయించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గంలో చేరబోతున్నట్టు ఆయన చెప్పారు.

ప్రజలందరి అభిప్రాయాన్ని కచ్చితంగా గౌరవించాలని, అమ్మ ఆశయాల కోసం అన్నా డీఎంకేని కాపాడేందుకు పోరాడుతానని పాండ్య రాజన్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో పన్నీరు సెల్వం కొనసాగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. నిన్నటి వరకు శశికళ గట్టి మద్దతుదారుడిగా వున్న ఆయన.. పార్టీని చీల్చేందుకు ప్రతిపక్ష డీఎంకేతో పన్నీరు సెల్వం చేతులు కలిపారని ఆరోపించిన పాండ్యన్.. ఇంతలోనే మనసు మార్చుకోవడం గమనార్హం.

అన్నాడీఎంకే చెందిన మరో ఇద్దరు ఎంపీలు సెల్వం వర్గంలో చేరారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ఉండాలని, ఆయనకు తాము మద్దతు ఇస్తామని ఎంపీలు అశోక్ కుమార్, పీఆర్ సుందరం ప్రకటించారు. నిన్నటివరకు అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు మద్దతుగా ఉన్న వీరు ఆమెకు ఝలక్ ఇచ్చి సెల్వం గూటికి చేరారు. అన్నా డీఎంకేలో చీలికలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోతారోనని ఆందోళన చెందుతున్న శశికళ వర్గానికి తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

అన్నా డీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్.. సెల్వం వర్గంలో చేరిన సంగతి తెలిసిందే. అంతేగాక అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని ఈసీకి లేఖ రాశారు. సెల్వం వెంట ప్రస్తుతం కొంతమంది ఎమ్మెల్యేలు ఉండగా, శశికళ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలు ఇటువైపు దూకేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక అన్నా డీఎంకే కార్యకర్తలు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులతో పాటు ఇతర పార్టీలు, సినీ ప్రముఖులు సెల్వంకు మద్దతు పలికారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles