భర్త పైశాచికం.. పరపురుషుడితో భార్య మాట్లాడిందని.. Afghan man accuses wife of speaking to other men

Afghan man accuses wife of speaking to other men

Zarina, Balkh province, Mazar-I-Sharif, Noor Mohammad Faiz, Sher Jan Durrani, crimes against women, domestic violence, physical abuse, violence, Taliban regime, Afghanistan, crime

A man in northern Afghanistan has cut off his young wife's ears, the head of a hospital caring for her said, confirming the brutal act of domestic violence.

భర్త పైశాచికం.. పరపురుషుడితో భార్య మాట్లాడిందని..

Posted: 02/02/2017 04:26 PM IST
Afghan man accuses wife of speaking to other men

సౌదీలో సినిమా పాటలు విన్న భార్యలకు భర్తలు విడాకులు ఇవ్వడం, పాటలకు లయబద్దంగా కాలు కదిపినా.. లేక నృత్యం చేసినా.. సంస్కార జీవితానికి వారు దూరమవ్యడం చూస్తూనే వున్నాం. అయితే అప్ఘనిస్తాన్ లోనూ ఈ జాడ్యం పెరుగుతూ వస్తుంది. ఇటీవలి కాలంలో ఇవి తారాస్థాయికి చేరుతూ అందోళనకరంగా మారాయి. బాల్య వివాహాలు చేసుకుని ఎలాంటి అవగాహన లేకుండానే తల్లులుగా మారుతున్న మహిళలు ఎందరో భర్తల చేతుల్లో పరాభావాలకు, దాడులకు గురవుతున్నారు.

గత ఏడాది జనవరిలో ఉత్తర అప్ఘనిస్తాన్ లోని పార్యాబ్ రాష్ట్రంలో భార్యతో గొడవపడి ఓ భర్త అమె భార్య ముక్కును నరికివేసి, పారిపోయిన భర్త పోలీసులకు చిక్కితే అరెస్టు చేస్తారని తాలిబన్ ప్రభావిత ప్రాంతంలోకి వెళ్లి తలదాచుకున్నాడు. అమె ముక్కుకు చికిత్స చేసేందుకు అప్ఘన్ డాక్టర్లు విఫల ప్రయత్నాలు చేసిన తరువాత.. అమెను టర్కీకి పంపి సర్జరీ చేయించారు. అలాగే ఘోర్ రాష్ట్రంలో గర్భవతిగా వున్న భార్యను ఓ భర్త సజీవదహనం చేశాడు. ఇలాంటి అనేక ఘటనలను అప్ఘన్ వాసులు మర్చిపోకముందే మరో ఘటన వెలుగుచూసింది.

ఉత్తర అప్ఘనిస్తాన్ లోని బాల్క్ రాష్ట్రంలో పర పురుషుడితో మాట్లాడిందన ఓ భర్త పైశాచికంగా వ్యవహరించాడు. ఏకంగా అమె చెవులను కోసేశాడు. రక్తమోడుతున్న అమె స్థానిక అస్పత్రిలో చేరడంతో విషయం బయటకు వచ్చింది. మజర్ ఇ షరీఫ్ అస్పత్రి డైరెక్టర్ నూర్ మహమ్మద్ ఫయాజ్ వివరాలు వెల్లడిస్తూ.. జరినా అనే 23 ఏళ్ల వివాహిత తన చెవులను అమె భర్త కోసేశాడని అరోపిస్తూ రక్తపు గాయాలతో విషమ పరిస్థులలో ఆసుపత్రికి వచ్చిందన్నారు.

అమెకు తన 13వ ఏటనే వివాహం జరిగిందని తెలిపారు. అయితే పరపురుషుడితో మాట్లాడుతుందన్న కారణాన్ని చూపిన అమె భర్త తన చెవులను కోసేశాడని పేర్కోన్నారు. బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ తన భర్త నుంచి తనకు విడాకులు కావాలని కోరింది. అతనితో తాను దాంపత్య జీవనం సాగించలేనని చెప్పింది. అతడికి తగిన శిక్ష పడాలని, అతడ్ని కారగారంలో వేయాలని తెలిపింది. కాగా అమె భర్త పరారీలో వున్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఉత్తర అప్ఘన్ లోని బాల్క అధికార ప్రతినిధి షేర్ జాన్ దుర్రానీ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zarina  Balkh province  Mazar-I-Sharif  Noor Mohammad Faiz  Sher Jan Durrani  Afghanistan  crime  

Other Articles