ములాయం యూటర్న్.. మిత్రపక్షం అభ్యర్థులకు ట్విస్ట్ mulayam takes u turn on alliance with congress

Akhilesh my son after all father mulayam singh s flip flop on alliance

UP elections 2017, Samajwadi Party, SP congress alliance, Mulayam Singh, Akhilesh Yadav, Rahul Gandhi, Samajwadi-Congress alliance, politics

In the latest twist in the Yadav family battle ahead of the Uttar Pradesh polls, Mulayam Singh Yadav has taken a 180-degree turn

ములాయం యూటర్న్.. మిత్రపక్షం అభ్యర్థులకు ట్విస్ట్

Posted: 02/02/2017 01:38 PM IST
Akhilesh my son after all father mulayam singh s flip flop on alliance

ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతాయో చెప్పలేం. ఇక అధికార పార్టీ సమాజ్ వాదీలో ఏర్పడిన కుటుంబవివాదాల నేపథ్యంలో అసలు పార్టీ ఎటువైపు పయనిస్తుందన్న విషయం రాజకీయ విశ్లేషకులు కూడా అంచానా వేయలేకపోతున్నారు. అంతలా ట్విస్టులు, యు టార్న్ లు తీసుకుంటూనే ఎన్నికల బరిలోకి దిగుతున్నారు అభ్యర్థులు. తాజాగా సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరోసారి యూటర్న్ తీసుకుని పార్టీ తరుపున ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు ట్విస్ట్ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీతో పోత్తు పెట్టుకోవడంపై నిన్న కాక మొన్న అంతెత్తున లేచిన ములాయం సింగ్.. తన కుమారుడు ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నాడో అర్థం కావడం లేదని అన్నారు. ఒంటరిగా పోటీ చేసి కూడా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే అవకాశం వున్నా.. కాంగ్రెస్ పార్టీతో పోత్తుపెట్టుకోవడం ఎందుకని ప్రశ్నించాడు. ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పొత్తును తాను అంగీకరించనని స్పష్టం చేశారు. ఈ  కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోనని ప్రకటించారు.

ఇలా చెప్పిన తరువాత మరుసటి రోజునే తన మనస్సును మార్చుకున్నారు. తాను తన పార్టీ అభ్యర్థలకు మాత్రమే ప్రచారం చేస్తానని, ఎట్టి పరిస్థితుల్లోనూ తాను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేది లేదని.. రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా కూడా కేవలం సమాజ్‌వాదీ తరఫున మాత్రమే ప్రచారం చేస్తానని చెప్పారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు కొంత షాక్ కు గురయ్యారు. రాహుల్ గాంధీ అన్ని నియోజకవర్గాల్లో తిరిగి ప్రచారం చేయడం సాధ్యం కాదని, కాబట్టి రాష్ట్ర నేతలపై అశలు పెట్టకోగా, ములాయం హ్యాండిచ్చాడని అందోళన చెందారు.

అయితే తన కొడుకు కోసం ములాయం మళ్లీ మనస్సును మార్చుకున్నారు. పొత్తును అంగీకరిస్తూనే.. తాను కాంగ్రెస్ అభ్యర్థుల తరపున కూడా ప్రచారం నిర్వహిస్తానని చెప్పుకోచ్చారు. కాంగ్రెస్ సమాజ్ వాదీ పార్టీల పోత్తతో ఎన్నికల బరిలోకి వెళ్తున్నప్పుడు ఒక పార్టీ అభ్యర్థులకు మాత్రమే ప్రచారం చేస్తానని చెప్పడం భావ్యం కాదన్నారు. అందుకనే కాంగ్రెస్ అభ్యర్థుల తరపున కూడా ప్రచారం చేస్తానన్నారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు తన అశీస్సులు వుంటాయని, ఎంతైనా వాడు నా కొడుకు కదా అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పుకోచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles