హరికృష్ణ అందుకే దూరంగా ఉంటున్నాడా? | Harikrishna far away to TDP.

Harikrishna says why he far away to party

Nandamuri Harikrishna, Nandamuri Family, Telugu Desam Party, Harikrishna TDP, Harikrishna Active TDP, TDP Leader Harikrishna, Harikrishna Chandrababu Naidu, Nandamuri VS Nara Clash

Nandamuri Harikrishna explained why he far away to Telugu Desam Party and active soon only.

హరికృష్ణ ప్రస్టేషన్ అదన్న మాట...

Posted: 01/28/2017 09:53 AM IST
Harikrishna says why he far away to party

తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ దూరంగా ఉండటం, గత కొంతకాలంగా నందమూరి వారసుల్లో మనస్పర్దలు అన్ని తెలిసిన అంశాలే. విభజన సమయంలో చంద్రబాబు నాయుడు కిక్కురుమనకుండా ఉంటే, తాను మాత్రం వ్యతిరేకమంటూ వ్యాఖ్యానించి పార్టీని తీవ్ర ఇరకాటంలో పెట్టాడు నందమూరి వారసుడు. ఆపై మళ్లీ రాజ్యసభ సీటు ఆశించి భంగపడ్డ హరికృష్ణ, కనీసం ఎమ్మెల్సీ అయిన దక్కుతుందన్న ఆశతో ఎదురు చూసినా అదీ కుదరలేదు. ఒకానోక దశలో నిరాశలోకి కూరుకుపోయిన ఆయన వైసీపీలోకి మారిపోతారన్న స్థాయికి వార్తలు వినిపించాయి. అయితే స్తబ్ధత పాటిస్తూ వస్తున్న ఆయన రాజకీయాలకు, ముఖ్యంగా సొంత కుటుంబ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.

ఈ నేపథ్యంలో తాను పార్టీకి ఎందుకు దూరంగా ఉండాల్సి వస్తుందోనంటూ వివరణ ఇచ్చేసుకున్నాడు. తాను నిజాలు మాట్లాడ‌తాను కాబ‌ట్టే త‌న‌ను దూరంటూ వ్యాఖ్యానించి క‌ల‌క‌లమే రేపాడు. కృష్ణా జిల్లా కోడూరు మండ‌లంలోని న‌ర‌సింహాపురంలో ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యాడు. గతంలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలోనే ఆ నిధులు మంజూరు చేయించగా, ఆ పనులు ఇప్పటికీ పూర్తయ్యాయి. దీంతో నిర్మాణం పూర్త‌యిన రోడ్డును ప్రారంభించాల్సిందిగా గ్రామ‌స్తులు ఆయ‌న‌ను ఆహ్వానించారు. వారి కోరిక‌పై  రోడ్డును ప్రారంభించిన హ‌రికృష్ణ అనంత‌రం మీడియాతో మాట్లాడాడు.  

నిజాలు మాట్లాడ‌డం, ఉన్న‌ది ఉన్న‌ట్టు చెప్ప‌డం వ‌ల్ల త‌న‌కు ఎన్నో ఎదురుదెబ్బ‌లు త‌గిలాయ‌న్నాడు. అయినా వెన‌క‌డుగు వేసే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పారు. తెలుగువాడికి గౌర‌వం తీసుకొచ్చిన నేత ఎన్టీఆర్ అని, తాను రాజకీయాలకు దూరంగా ఉండటం తాత్కాలికంగానే నంటూ చెప్పుకొచ్చాడు. త్వరలో మళ్లీ తాను యాక్టివ్ అయ్యే ఛాన్సు ఉందంటూ పరోక్షంగా వ్యాఖ్యానించినప్పటికీ, అది టీడీపీ ద్వారానేనా? లేక కొత్త పార్టీ తోనా అన్నది తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri Harikrishna  TDP  

Other Articles