అమ్మాయి అది అమెరికా... అమీర్ పేట కాదు... కౌంటర్ వీడియోతో షాకిచ్చిన అబ్బాయి | Not Ameerpet Its America.

Counter video on american telugu student life

Telugu student America, Indian Students trouble India, Indian Student In US, American Telugu Student Life, Counter video to Frustrated Student, Not Ameerpet America

Viral video of Telugu student detailing her troubles in the US sparks. Counter attack For Telugu Frustrated Student in USA.

ITEMVIDEOS:తెలుగు స్టూడెంట్స్ కష్టాలు.. కౌంటర్ పడిందిగా...

Posted: 01/21/2017 09:00 AM IST
Counter video on american telugu student life

కోటి కలలతో అమెరికాలో అడుగుపెడుతున్న భారతీయుల పరిస్థితిని వివరిస్తూ ఓ అమ్మాయి పోస్ట్ చేసిన వీడియో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. స్వర్గదామం పేరిట వచ్చేవారు అక్కడ అనుభవిస్తున్న కష్టాలంటూ అంతే ఆవేదన భరితంగా అందులో పేర్కొంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అమెరికా వెళ్లి విద్యాభ్యాసం చేసి అనంతరం మంచి ఉద్యోగాలు పొందాలనుకునే వారికి పరిస్థితి ఆశాజనకంగా ఏమీ లేదంటూ తేల్చేసింది.

అయితే 48 గంటలు గడవక ముందే ఆ అమ్మాయికి ఝలక్ ఇచ్చాడు ఓ అబ్బాయి. ఆ ఆరోపణలకు కౌంటర్ గా అతగాడు మరో వీడియో పెట్టాడు. అమెరికా అంటే హైదరాబాద్ లోని అమీర్ పేట్ కాదని ఈ అబ్బాయి ఘాటు కౌంటర్ ఇచ్చారు. అమెరికాలో చదువు అనేది మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరికీ ప్లాన్స్ ఉంటాయని ఈ వీడియోలో విద్యార్థి వివరిస్తూ...20 లక్షలు ఖర్చు పెట్టి వీసా తెచ్చుకుని ఇంటర్వ్యూకెళ్లి అక్కడ క్వాలిఫై అయితేనే అమెరికా వచ్చారని స్పష్టంచేశారు.

ఇండియాలో దోమలున్నట్టే అమెరికాలో బగ్స్ ఉంటాయని వ్యాఖ్యానించారు. అత్యున్నత చదువులు పూర్తి చేసుకున్న వారు తగు విధంగా కొలువులు పొందుతుంటే అలాంటి కెపాసిటీ లేని వారు సర్దుకుపోతున్నారని తెలిపారు. అలా చేసేదాన్ని పాచి పని అంటూ తేలిగ్గా తీసుకోవద్దని ఒకింత ఘాటుగా సూచించారు. ఎవరైనా పార్ట్ టైమ్ ఉద్యోగం చేసి కింది స్థాయి నుంచి పైస్థాయికి వెళ్లాల్సిందేనని తేల్చిచెప్పారు. ఔత్సాహికులు అందరూ అమెరికాకు రావాలని ఇక్కడ లైఫ్ చూడాలని సదరు విద్యార్థి ఆకాంక్షించారు.

ఇదిలాఉండగా మరో యువతి కూడా ఈ వీడియోపై ఘాటుగా స్పందించారు. టైం పాస్ కోసం ఇలాంటి వీడియోలు పెట్టవద్దని కోరుతూ ఈ తరహా పనుల వల్ల విద్యార్థుల్లోనే కాకుండా వారి కుటుంబ సభ్యుల్లోనూ ఆందోళన నెలకొంటుందని తెలిపారు. మొత్తానికి ఆ అమ్మాయి చెప్పినంత దారుణంగా ఏ మాత్రం లేదని, అలా ఉండి ఉంటే చాలా మంది ఇక్కడికి తిరిగి వచ్చేసి ఉండేవారు కూడా అని వ్యాఖ్యానించేవారు లేకపోలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Student  America  Video  

Other Articles