యాదవుల అవమానించిన చాగంటి.. కేసు నమోదు | Case filed against Changanti for derogatory.

Changanti koteswara rao derogatory comments on lord krishna

Changanti Koteswara Rao, Lord Krishna, Yadav community, Yadav community Changanti, Andhra Pradesh's adviser Chaganti, Chaganti Controversy, Case against Chaganti, Chaganti Lord Krishna, Chaganti derogatory Comments

Complaint against spiritual speaker Changanti Koteswara Rao for 'derogatory' comment on Lord Krishna.

కుల వివాదంలో ప్రవచనాల చాగంటి

Posted: 01/17/2017 01:18 PM IST
Changanti koteswara rao derogatory comments on lord krishna

ప్రముఖ ప్రవచనకర్త, తెలుగుదేశం ప్రభుత్వ సలహాదారు బ్ర‌హ్మ‌శ్రీ చాగంటి కోటేశ్వరరావు వివాదాల్లో చిక్కుకున్నారు. తమ కులంపై తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ ఆ ఆధ్యాత్మిక వేత్తపై కొందరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఓ ఛానెల్ లో ప్రవచనం చెబుతూ... శ్రీకృష్ణ భగవానుని పురాణం వల్లించాడు. అందులో తమ కులాన్ని అవమానించారన్నది వారి వాదన. శ్రీకృష్ణుడి తలకడిగితే మొల కడగని గొల్లకులంలో జన్మించారు అని తేల్చి చెప్పడం ద్వారా యాదవులు శుభ్రంగా ఉండరు అనే విధంగా కించపరిచారని ఆయన మండిపడ్డారు. చాగంటి కోటేశ్వర్ రావు తన వాఖ్యాలను వెంటనే ఉపసంహరించుకుని అదే చానల్ ద్వారా వెంటనే యాదవ కులస్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బీసీ సంఘర్షణ సమితి రాష్ట్ర ఉపాద్యక్షులు - యాదవ సంఘం అధ్యక్షులు జేకే శేఖర్ యాదవ్ తమ కులస్థుల మనోభావాలను కించపరిచారంటూ వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గతంలో మహిళలను అవమాన పరుస్తూ చాగంటి చేసిన ప్రవచనం వివాదాస్పదమైంది. 2016 ఏప్రిల్ చంద్రబాబు సర్కార్ ఆయన్ని రాష్ట్ర సాంప్రదాయ, అభివృధ్ధి ఉచిత సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Changanti Koteswara Rao  Lord Krishna  YadaV Community  Controversy  Case Filed  

Other Articles