యువకుడి ప్రాణాలను బలిగొన్న తెలంగాణ మంత్రి కారు.. Telangana Minister’s Car Mows Down Teenager

Telangana minister s car mows down teenager

Telangana Endowments Minister, A Indirakaran Reddy, bykist, teenager, accident, Telangana minister's car mows down boy, pratibha hospital, victim's relatives, satwik, justice, crime news

A teenager was killed when a Telangana minister's car mowed him down near Nirmal town in Nizamabad district

యువకుడి ప్రాణాలను బలిగొన్న తెలంగాణ మంత్రి కారు..

Posted: 01/14/2017 06:31 PM IST
Telangana minister s car mows down teenager

సంక్రాంతి పర్వదినాన నిర్మల్‌లో విషాధం అలుముకుంది. తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి చెందిన కారు అతివేగంగా దూసుకెళ్లి ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. నిర్మల్ లోని శాంతినగర్ క్రాస్ రోడ్డు వద్ద మ‌ధ్యాహ్నం ఈ ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చోటుచేసుకుంది. బైక్‌పై ప్రయాణిస్తున్న జోగు సాత్విక్ (17) ను వేగంగా వ‌చ్చిన‌ మంత్రి కారు ఢీ కొట్ట‌డంతో అత‌డికి తీవ్ర గాయాల‌య్యాయి. అత‌డిని స్థానికులు హుటాహుటిన నిజామాబాద్ లోని ప్రతిభా ఆసుప‌త్రికి తరలించినా.. అతని ప్రాణాలు కాపాడలేకపోయారు.

ఈ ప్ర‌మాద దృశ్యం స్థానికంగా వున్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. వెనక నుంచి వచ్చిన ఓ కారు ఢీ కొట్టడంతో సాత్విక్ పది అడుగుల దూరంలోకి ఎగిరిపడ్డాడు. ఆ దృశ్యాల‌ను ప‌రిశీలించిన పోలీసులు ఆ కారు రాష్ట్ర దేవాదాయ, గృహ నిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిదిగా గుర్తించారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఆయ‌న భార్య కారులో వున్నట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే డ్రైవర్ రాజును అదుపులోకి తీసుకున్న‌ పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana Endowments Minister  A Indirakaran Reddy  bykist  sateik  nirmal  crime news  

Other Articles