అఫిషియల్: తొలి రోజు కలెక్షన్లలో ఖైదీ రికార్డు allu aravind pressmeet on khaidi no 150 first day collections

Allu aravind pressmeet on khaidi no 150 first day collections

khaidi no 150, khaidi number 150, allu aravind, khaidi no 150 firsrt day collections, box office, collections, record, tollywood

it is official as noted film producer allu aravind makes public about the collections of khaidi number 150, says chiranjeevi's reentry movie created record on first day collections

ITEMVIDEOS: అఫిషియల్: తొలి రోజు కలెక్షన్లలో ఖైదీ రికార్డు

Posted: 01/12/2017 04:34 PM IST
Allu aravind pressmeet on khaidi no 150 first day collections

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పునరాగమనం చేసిన 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రికార్డులను తిరగ రాసిందని అధికారికంగా వెల్లడైంది. ఈ మేరకు ప్రముఖ నిర్మాత అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ.. ఖైదీ నెంబర్ 150 నమోదు చేసిన రికార్డుల వివరాలను తెలియజేశారు. దాదాపు పదేళ్ల తరువాత మళ్లీ టాలీవుడ్ లో అడుగుపెట్టన చిరంజీవిని అభిమానులు బాగా అధరించారని ఆయన అన్నారు. చిరంజీవి నటించిన 150వ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తూ రికార్డులను క్రియేట్ చేస్తోందనితెలిపారు.

తొలి రోజున రూ. 47.07 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించిందని అల్లు అరవింద్ తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఖైదీ నెంబర్ 150 రూ. 30కోట్ల 45వేలు వసూలు చేసిందని వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రంలో రూ. 4.70 కోట్లు కలెక్ట్ చేసిందని తెలిపారు. అమెరికాలో 1.22 మిలియన్ డాలర్లను కొల్లగొట్టిందని చెప్పారు. ఇతర దేశాల్లో 3,20,000 డాలర్లు వసూలు చేసిందని తెలిపారు. ఒడిశాలో రూ. 12 లక్షలు, తమిళనాడులో రూ. 20 లక్షలు, ఇతర రాష్ట్రాల్లో రూ. 58 లక్షలు వసూలు చేసిందని చెప్పారు.    

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : khaidi no 150  khaidi number 150  allu aravind  box office  collections  record  tollywood  

Other Articles