కొరియర్ బాయ్ కృష్ణ కుమార్@ రూ.2000 నోట్లు I-T suspects new notes may have been ‘home delivered’

I t suspects new notes may have been home delivered directly from govt presses

Income tax officials, intelligence sleuths, investigation, virtually home delivery, new banknotes, Rs 2000 notes, government presses, central bank, RBI, courier boy krishna kumar, demonetisation.

IT and intelligence sleuths have launched an investigation suspecting that an organised racket may have “virtually home delivered” new banknotes from government presses

కొరియర్ బాయ్ కృష్ణ కుమార్@ రూ.2000 నోట్లు

Posted: 01/11/2017 11:58 AM IST
I t suspects new notes may have been home delivered directly from govt presses

నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు తమ వద్దనున్న పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి, ఇక అవసరం కొద్ది కొత్త నోట్ల కోసం రోజుల తరబడి బ్యాంకులు, ఏటీయంలలోని క్యూలైన్లో నిల్చున్నా కొందరికి కేవలం రెండు వేలే లభించగా, మరికోందరికీ  అవి కూడా లభించలేదు. అయితే ఆ తరువాత ఐటీ, ఇంటెలిజెన్స్ అధికారులు జరిపిన దాడుల్లో మాత్రం వందలు, వేలల్లో కొత్త నోట్లు కొందరి వద్దకు దొడ్డిదారిన వచ్చేశాయి. ఇంకొందరి వద్దైతే ఏకంగా లక్షల కొత్త నోట్లు ఎంచక్కా వారి ఖజానాల్లోకి చేరిపోయాయి.

నల్లకుబేరుల జాబితాలో చేరిన వారెవ్వరూ బ్యాంకుల వద్ద క్యూ కట్టకుండానే ఇన్నేసి నోట్లు ఎలా పోందారు..? ఇదంతా ఏమిటి? వారికీ కొత్త నోట్లు ఎలా దొరుకుతున్నాయి. సామాన్యుల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో ఈ అంశమై దృష్టిసారించిన అదాయపన్ను శాఖ అధికారులలోనూ అనుమానాలు వ్యక్తం చేసింది. పెద్ద ఎత్తున్న కొత్త నోట్లు ప్రభుత్వ ముద్రణా సంస్థలు, ఆర్బీఐ నుంచే డైరెక్ట్‌గా కొందరి ఇళ్లకు చేరినట్టు ఐటీ అనుమానిస్తోంది. దీనిపై ఆదాయపు పన్ను శాఖ, ఇంటిలిజెన్స్ అధికారులు విచారణ ప్రారంభించాయి.
 
అదెలా సాధ్యం అంటారా..? కొరియర్ బాయ్ ద్వారా.. కొత్త నోట్లు అక్రమార్కుల దరి చేరాయా..? అంటే అవుననే అనుమానాలనే అదాయపన్ను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో ఇలా కృష్ణ కుమార్ అనే కొరియర్ బాయ్ నుంచి 20 లక్షల రూపాయల కొత్త రెండు వేల నోట్లు లభ్యం కావడమే అనుమానాలకు తావిస్తుంది. అధికారులకు సమాచారం అందడంతో.. డిసెంబర్ 15న గ్రేటర్ కైలాష్-1 ఎం బ్లాక్ మార్కెట్లో డెలివరీ కోసం వేచిచేస్తున్న కొరియర్ బాయ్ ని పట్టుకుని తనిఖీలు చేపట్టగా అతని వద్దనుంచి రెండు వేల రూపాయల నోట్లు బయటపడ్డాయి. ఈ నోట్లు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌కు చెందిన రెండు ప్రభుత్వ కరెన్సీ ప్రెస్ లలో ముద్రించినట్లు వాటి ముద్రణ వేసి వున్నాయి.
 
ముద్రణ సంస్థల సీల్‌తో ఉన్న నగదు పబ్లిక్‌లో పట్టుబడటం ఇదే మొదటిసారని ఇద్దరు సీనియర్ ఐటీ, ఇంటిలిజెన్స్ అధికారులు తెలిపారు. ఒకవేళ ప్రింటింగ్ ప్రెస్, ఆర్బీఐ చెస్ట్‌లు తమ లొసుగులతో రాజీపడి ఇలాంటి కార్యకలాపాలేమైనా నిర్వహిస్తే,  ఆర్బీఐ కచ్చితంగా తమతో మరింత సమాచారం పంచుకోవాల్సి ఉంటుందని మరో అధికారి చెప్పారు. ఆర్బీఐ నుంచి బ్యాంకులకు నగదు చేరవేస్తున్న నగదు నిర్వహణ కంపెనీల పాత్రపై కూడా ఐటీ, ఇంటిలిజెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. అధికారులు పట్టుకున్న ఆ బ్యాగులు సాల్బోని, నాసిక్ ప్రెస్‌లకు సంబంధించినవి. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఈ  రెండు ప్రెసింగ్ సంస్థలు రోజుకు 52 లక్షల పీస్‌ల నోట్లను ప్రింట్ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh