ఒబామా లాస్ట్ స్పీచ్ ఎగ్జయిట్ మెంట్.. ఇలా వెళ్లాడో లేదో ట్రంప్ ఏం చేస్తున్నాడు? | Barack Obama 'to admonish' Donald Trump in Chicago farewell speech.

Obama closes book on presidency

Barack Obama, Obama Farewell Address, Donald Trump press meet, Trump first press meet, Barack Obama last day, Obama last press meet, Defense of Democracy, Obama Closes Book on Presidency, Chicago farewell speech, Donald Trump first press meet

Barack Obama Uses Farewell Address to Call For Defense of Democracy Against Donald Trump.

బరాక్ ఒబామా డౌన్... డొనాల్డ్ ట్రంప్ ఇన్

Posted: 01/11/2017 10:13 AM IST
Obama closes book on presidency

అగ్రరాజ్యం అధ్యక్ష పదవికి తొలి నల్ల జాతీయుడు బరాక్ ఒబామా తన చివరి ప్రసంగంలో ఉద్వేగానికి లోనయ్యాడు. విశ్వాసం అంటే ఏంటో తాను చికాగో ప్రజల నుంచి నేర్చుకున్నాన్న ఆయన, ప్రతిరోజు మీ నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటేనే ఉన్నానని, దేశ ప్రజలందరూ కలిసి తనను బెట్టర్ ప్రెసిడెంట్‌గా, ఉత్తమ వ్యక్తిగా చేశారని ఒబామా వ్యాఖ్యానించాడు.

'మన దేశాన్ని ప్రత్యేకంగా నిలుపుకునే సామర్థ్యం మనకు ఉంది. ప్రజల మద్ధతు వల్లే అధ్యక్షుడిని కాగలిగాను. గత కొన్నేళ్లుగా నన్ను, మిషెల్లీ ఒబామాను ఎంతగానో ఆదరించారు. అందుకు మీకు మరోసారి ధన్యావాదాలు తెలియజేసుకుంటున్నాను. గత పదేళ్లలో దేశంలో ప్రజాస్వామ్యం ఎంతో మెరుగుపడింది. సామాన్య ప్రజలు స్పందించినప్పుడే మార్పు అనేది సాధ్యపడుతుంది. అందరూ కలిసికట్టుగా ఇదే తీరుగా భవిష్యత్తులోనూ పోరాటం సాగించాలి' అని ఒబామా పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే జాతి వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దని, వివాదాస్పద అంశాల జోలికి పోకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలంటూ పరోక్షంగా ట్రంప్ కి సలహాలు ఇచ్చాడు కూడా.

కాగా, రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన ఒబామాకు వీడ్కోలు ప్రసంగానికి డెమొక్రటిక్ పార్టీ నేతలు, ఇతర కీలక నేతలు, అధికారులు హాజరయ్యారు. మరోవైపు ఆయన అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు.


ట్రంప్ ఫస్ట్ ప్రెస్ మీట్..
అమెరికా అధ్యక్షుడిగా పదవీ విరమణ చేయనున్న ఒబామా, జాతిని ఉద్దేశించి చివరిగా ప్రసంగించిన మరుసటి రోజే కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి మీడియా సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఇంతవరకూ మీడియాతో మాట్లాడని ట్రంప్, నేడు ప్రెస్ బ్రీఫింగ్ ఇవ్వనున్నారని ప్రకటన వెలువడింది. తన వ్యాపార నిర్వహణ బదిలీ, దేశ భవిష్యత్తుపై తన నిర్ణయాలు ఎలా ఉంటాయి? అమెరికా వృద్ధి కొనసాగేలా తన పాలన ఎలా సాగుతుందన్న విషయమై ఆయన మాట్లాడతారని వైట్ హౌస్ కు కాబోయే ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసెర్ వెల్లడించారు.

కాగా, ట్రంప్ తొలి సమావేశం కోసం దేశ ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. నవంబర్ లో ఎన్నికలు ముగిసిన తరువాత ఆనవాయితీగా వచ్చే మీడియా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ను సైతం ట్రంప్ నిర్వహించలేదన్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ చేపట్టిన ర్యాలీల్లో మాట్లాడినా, జర్నలిస్టులతో పెద్దగా కలవలేదు ట్రంప్. ఇక ఒబామా చివరి ప్రసంగం ముగియగానే, ట్రంప్ నుంచి మీడియాకు ఆహ్వానం రావడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Obama  Chicago farewell  Donald Trump  

Other Articles