బాక్సింగ్ బౌట్ లో విషాదం.. 14 ఏళ్ల బాలిక మృతి.. 14-year-old girl collapses during boxing competition

14 year old girl collapses during boxing competition

Khelo India, boxing competition, 14-year-old girl, Khelo India boxing competition, Marishwary, Medical college, Tuticorin, Tamil Nadu,

In a shocking incident, a 14-year-old girl from Tuticorin of Tamil Nadu while participating in the Khelo India boxing competition.

బాక్సింగ్ బౌట్ లో విషాదం.. 14 ఏళ్ల బాలిక మృతి..

Posted: 01/06/2017 08:51 PM IST
14 year old girl collapses during boxing competition

క్రీడలంటే అసక్తి వుండటం ఒక్కటే కాదు.. ఆ క్రీడల పట్ల పూర్తిగా నిఫుణుల అథ్వర్యంలో శిక్షణ పోందిన తరువాతే కానీ కాంపిటీషన్ లలో పాల్గొనాలి. అరకోర తర్ఫీదును తీసుకుని పోటీలలో పాల్గోంటే ప్రాణాలకే ముప్పని తమిళనాడులో జరిగిన ఈ ఘటన హెచ్చరిస్తుంది. బాక్సింగ్ కాంపిటీషన్లో పాల్గోన్న ఓ 14ఏళ్ల బాలిక అకస్మిక మరణం చెందింది. బాక్సింక్ రింగ్‌లో కుప్పకూలిన బాలికను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. ఈ ఘటన తమిళనాడులో ఖేలో ఇండియా బాక్సింగ్ ఈవెంట్లో జరిగింది.

ట్యూటికోరిన్ కు చెందిన మరిశ్వరీ(14) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది. గత వారం రోజులుగా తన అంకుల్ పర్యవేక్షణలో బాక్సింగ్ శిక్షణ తీసుకుంది. ట్యూటికోరిన్‌లో జరిగిన ఖేలో ఇండియా బాక్సింగ్ కాంపిటీషన్లో మరిశ్వరీ పాల్గొంది. 14-17 ఏజ్ కేటగిరి ఈవెంట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బరిలోకి దిగిన మరిశ్వరీ బాక్సింగ్ రింగ్‌లో తన ప్రత్యర్థి పంచ్‌లకు తాళలేక కుప్పకూలిపోయింది.

ఆమెను చికిత్స నిమిత్తం వెంటనే ట్యూటికోరిన్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. మరిశ్వరీని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు వెల్లడించారు. అదే ఆస్పత్రిలో పోస్ట్ మార్టం చేయనున్నట్లు అధికారులు చెప్పారు. మరిశ్వరీ చాలా ఆరోగ్యంగా ఉండేదని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. 1200 మందికిపైగా విద్యార్థులు ఈవెంట్లో పాల్గొనగా, బాక్సింగ్‌లో 40 మంది బరిలోకి దిగారు. అయితే తమ కుటుంబంలోనే విషాదం చోటుచేసుకుందని వారు కన్నీటి పర్యంతమయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles