‘నీ రేటు ఎంత’ అని యువనేత అమెను అడిగితే.. Kerala woman gets man to pay Rs 25,000 to charity home

Kerala woman gets man to pay rs 25 000 to charity home

kerala woman facebook post, kerala woman asked her rate, kerala viral facebook post, kerala woman teaches indecent man a lesson, kerala woman asked her rate, kerala woman facebook post, sreelakshmi satheesh, sreelakshmi satheesh facebook post, trending news, viral, trending

Sreelakshmi Satheesh, a motivational speaker and the CEO of an educational consultancy firm in Kerala, recently took to Facebook to write about the incident

‘నీ రేటు ఎంత’ అని అమెను ఓ యువనేత అడిగితే..

Posted: 12/30/2016 08:33 PM IST
Kerala woman gets man to pay rs 25 000 to charity home

ఓ అగంతకుడి నుంచి గుర్తుతెలియని కాల్ వచ్చింది. ఎవరో పనిమీద చేసుంటారులే అనుకుని ఎత్తగానే.. అవతలి వైపు నుంచి ఎన్నడూ లేని విధంగా, అభ్యంతరకర రీతిలో ప్రశ్నలు వినిపిస్తే.. ఏ మహిళ అయినా ఏంచేస్తుంది..? షాక్ కు గురవుతుంది. తేరుకోగానే ఫోన్ కట్ చేస్తుంది. ఇదే జరిగింది శ్రీలక్ష్మీ సతీష్ కూడా. ‘మనం ఎప్పుడు కలుద్దాం, మీ రేటు ఎంత, రూ. 3000కు వస్తావా, హోటల్‌ గది బుక్‌ చేయమంటారా’.... విద్యా సంస్థ కన్సల్టెన్సీ సీఈవో, మోటివేషనల్‌ స్పీకర్‌ గా పనిచేస్తున్న కేరళ వనిత శ్రీలక్ష్మీ సతీష్ కు వచ్చిన ఫోన్లలో వినిపించిన మాటలు ఇవి. ఆమెకు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడారు.

ఇవన్నీ భరించలేక ఆమె సెల్‌ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు తనకు ఫోన్‌ చేసిన వారికి ఫోన్ నెంబర్ అధారంగా గుర్తించింది. తనకు ఫోన్ చేసిన వ్యక్తి ఒక జాతీయ పార్టీ యువజన విభాగంలో ప్రాంతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నాడని తెలుసుకుంది. అంతే ఆ పార్టీకి చెందిన నాయకులు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంలో రాజీ కుదర్చుకోవడం ఇద్దరికీ మంచినద్నారు. అయితే ఆ యువనాయకుడిని పార్టీ నుంచి బహిష్కరించాలని శ్రీలక్ష్మీ విధించిన షరతుకు కూడా వారు అంగీకరించారు. అయితే ఈ మేరకు అమెకు పార్టీ నేతల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమైంది.

ఇంతలో నిందితుడి తండ్రి శ్రీలక్ష్మి వద్దకు వచ్చి తన కొడుకును క్షమించాలని, కేసు పెట్టొద్దని వేడుకున్నాడు. అయితే శ్రీలక్ష్మీ మరో షరతును విధించగా, నిందితుడి తండ్రి అఘమేఘాల మీద వెళ్లి షరతును పూర్తి చేశాడు. అదేంటంటే..  ఏదైనా స్వచ్ఛంద సంస్థకు కూ. 25000 విరాళం ఇవ్వాలని అమె కోరాగా, దానిని చెల్లించి ఆ తరువాత దానికి సంబంధించిన రసీదు కూడా అమెకు అందించాడు. అయినా తన కోపం చల్లారకపోవడంతో ఈ వ్యవహారం గురించి తన ఫేస్‌ బుక్‌ పేజీలో వివరంగా రాశారు. ఇది కాస్తా వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sreelakshmi Satheesh  kerala woman  indecent man  facebook post  viral  trending  

Other Articles

Today on Telugu Wishesh