అదిరిపోయే స్టెపుల్లతో పెళ్లిపందిరిలో జోష్ నింపిన వధువు bride dancing her way to the wedding stage

Viral video bride dancing her way to the wedding stage

dancing bride, dancing bride viral video, viral video bride dancing, bride dancing,

this particular bride made sure she makes the most of her D-day and has a grand entry which, little did she know, will become a viral video.

అదిరిపోయే స్టెపుల్లతో పెళ్లిపందిరిలో జోష్ నింపిన వధువు

Posted: 12/25/2016 09:08 AM IST
Viral video bride dancing her way to the wedding stage

భారతీయ సంప్రదాయానికి చెందిన పడతి.. మరికోద్ది సేపట్లో పెళ్లి పీటలు ఎక్కేస్తుందన్న తరుణంలో.. ఇదివరకైతే తన తల్లిదండ్రులకు ఇక దూరమవుతున్నానన్న అందోళనతో వారి ముఖాల్లో సంతోషం ఏ కోశాన కనబడేది కాదు. అయితే మారుతున్న కాలంతో పాటు అమ్మాయిలు కూడా శరవేగంగా మారుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. పాశ్చాత సంప్రదాయాలకు తలొగ్గి మేమేం తక్కువా అంటున్నారు. తమ పెళ్లిలో వరుడు మాత్రమే డాన్స్ వేసేవాళ్లు.. అది కూడా స్నేహితుల బలవంతం మీద. కానీ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయ్.  

తమ పెళ్లిలో తామే జోష్ తీసుకురావాలని భావించింది ఈ నవవధువు. ఇప్పుడా వీడియో కాస్తా సోషల్ మీడియాలో పోస్ట్ కాగానే దానిని వీక్షించడానికి పోటీ అధికం కావడంతో ఒక్కసారిగా ఈ వీడియో వైరల్ అయ్యింది. పెళ్లివేడుకలో డాన్స్ చేయడానికి తన బంధువులు కాస్త వెనక్కి తగ్గారేమో కానీ, వధువు మాత్రం తానే ముందుగా డ్యాన్స్ స్టార్ట్ చేసి అక్కడున్న వారిలో జోష్ తీసుకొచ్చింది. క్వీన్ మూవీలో కంగనా రనౌత్ డ్యాన్స్ పాటకు స్టెప్పులేసిన ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఢిల్లీకి సాగర్ అరోరా అనే వ్యక్తి ఓ వివాహ వేడుకకు సంబంధించిన రెండు వీడియోలు ఐదు రోజుల కిందట తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

ఇందులో ఓ వీడియోను రికార్డు స్థాయిలో 1.2 కోట్ల మంది వీక్షించగా, మరో వీడియోను 40 లక్షల మంది చూశారు. 1.4 లక్షల మంది వీడియోలను షేర్ చేయగా, 18 వేలకు పైగా నెటిజన్లు కామెంట్ చేశారు. మనం ఎన్నో వివాహ వేడుకలు చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం సమ్ థింగ్ స్పెషల్ అంటూ వీడియో పోస్ట్ చేసిన సాగర్ ఆరోరా తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ వీడియో ఫేస్‌బుక్‌లో బ్లాక బస్టర్ అయింది. కొందరు నెటిజన్లయితే సూపర్బ్ ఎంట్రీ అని, మరికొందరు ఇలా ఇక నుంచి వధువులు కంటిన్యూ చేయాలని కామెంట్ చేశారు. అయితే వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి ఆ వివాహం ఎక్కడ జరిగింది, వధువు వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dancing bride  dancing bride viral video  viral video bride dancing  bride dancing  

Other Articles