ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు greetings pour in for christians on christmas

Greetings pour in for christians on christmas

Betleham, Church of the Nativity, Christmas, Pranab Mukhurjee, president, PM Modi, Rahul Gandhi, Sonia Gandhi, celebrities, christmas, christians, greetings,

On the Eve of Christmas greeting pour-in for christians from president pranab, and various politiacains, and celebrities

ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు

Posted: 12/26/2016 07:04 AM IST
Greetings pour in for christians on christmas

ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్లు తమ పరమపవిత్రమైన క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఏసుక్రీస్తూ జన్మదినాన్ని పురస్కరించుకుని నిన్న రాత్రి నుంచే ప్రత్యేక పార్థనలతో భక్తులు తమ ప్రభువైన ఏసు నామాన్ని స్మరిస్తూ.. ప్రార్థనలు జరిపారు. అటు క్రిస్మస్‌ సందర్భంగా బెత్లెహాం భక్తులతో కళకళలాడుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి వేలాది భక్తులు క్రీస్తు జన్మదిన వేడుక కోసం పట్టణానికి చేరుకున్నారు. క్రీస్తు పుట్టినట్లు భావిస్తున్న చర్చ్‌ ఆఫ్‌ నేటివిటీ వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడి సంబరాలు, భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేసుకుంటున్నారు.

క్రిస్టియన్లకు ప్రముఖల శుభాకాంక్షలు  

యేసు క్రీస్తు జన్మదినాన్ని పవిత్రమైన పర్వధినంగా భావించి జరుపుకుంటున్న క్రిస్మస్‌ పండగ నేపథ్యంలో దేశంలోని క్రిస్టియన్లందరికీ దేశంలోని పలువురు ప్రముఖులు క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు. పాలకులు, రాజకీయ నేతలు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు శుభాకాంక్షలను తెలిపారు. క్రిస్మస్ పర్వదినాన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘క్రిస్మస్‌ ఆనంద సమయాన భారతీయులందరికీ శుభాకాంక్షలు. ఈ ఉత్సాహం మన హృదయాల్లో ప్రేమ, కరుణ నింపాలి.’ అని ప్రణబ్‌ సందేశమిచ్చారు. అటు ప్రధాని నరేంద్ర మోడీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, పలువురు రాజకీయ, సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు కూడా శుభాకాంక్షలను తెలిపారు.

క్రైస్తవులు ఒక‌రికొక‌రు శుభాకాంక్ష‌లు తెలుపుకున్నారు. మెద‌క్‌లోని సీఎస్ఐ చ‌ర్చికి చేరుకున్న వేలాది మంది క్రైస్త‌వులు ప్రార్థ‌న‌ల్లో మునిగిపోయారు. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని చ‌ర్చ్‌ల‌ను విద్యుద్దీప కాంతుల‌తో స‌ర్వాంగ సుంద‌రంగా అలంక‌రించారు. ఇక భాగ్య‌నగ‌రంలోని అన్ని చర్చ్‌లు భ‌క్తుల‌తో కళ‌క‌ళ‌లాడాయి. క్రైస్త‌వుల‌కు ప‌ర‌మ‌ప‌విత్ర‌మైన ఆదివారం రోజే క్రిస్మ‌స్ రావ‌డంతో ప్రార్థ‌న‌ల‌కు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్, ముఖ్య‌మంత్రులు కేసీఆర్‌, చంద్ర‌బాబునాయుడు  స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు క్రైస్త‌వుల‌కు క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh