ఇంధన ధరలపై తగ్గనున్న ఎక్సైజ్ సుంఖం.? :Government to reduce excice duty on Petrol and Diesel

Government to reduce excice duty on petrol and diesel

Petrol, Diesel, Fuel Prices, US dollar, Price hike, OPEC, fuel hike, Oil companies

With oil prices at the international market hitting $55 a barrel, oil companies in India are likely to hike the prices of petrol and diesel.

ఇంధన ధరలపై తగ్గనున్న ఎక్సైజ్ సుంకం?

Posted: 12/15/2016 02:46 PM IST
Government to reduce excice duty on petrol and diesel

కేంద్రంలో నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తరువాత.. దేశంలో ఇంధన ధరలు క్రమంగా దిగివచ్చాయి. కానీ రెండున్నరేళ్ల తరువాత మళ్లీ పరిస్థితులలో మార్పులు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ అయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో ఇవాళ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ద్వైమాసికంగా ఇంధన ధరలను సమీక్షించనున్న ఇంధన సంస్థలు ధరలను భారీగా పెంచాలని భావిస్తున్నాయని సమాచారం.

రెండు వారాలుగా అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు 15 శాతం మేర పెరిగిన నేపథ్యంలో.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.6 దాకా పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చమురు ఎగుమతి చేసే ఒపెక్‌ దేశాలతోపాటు రష్యా తదితర దేశాలు కూడా.. 2001 తర్వాత మళ్లీ ఇప్పుడు సరఫరాలను తగ్గించాలని నిర్ణయించడం ధరల పెరుగుదలకు కారణం. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో చమురు సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను లీటరుకు ఆరు నుంచి ఏడు రూపాయల దాకా పెంచే అవకాశం కనిపిస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ అయిల్ ధరలు బ్యారెల్ కు 55 డాలర్లు పలుకుతుండడంలో అందుకు అనుగూణంగా భారత్ లో కూడా ఇంధన ధరలను పెంచాల్సి వస్తుందని.. ఈ క్రమంలో లీటరు పెట్రోల్ పై 7 రూపాయలు, లీటరు డీజిల్ పై అరు రూపాయల మేర ధరలను పెంచేందుకు భారతీయ ఇంధన సంస్థలు సమీక్షిస్తున్నాయి. కాగా కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ఇంత భారీగా ఇంధన ధరలను ఎన్నడూ పెంచలేదు.

ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను మరింత ఇబ్బందులు పెట్టడం ఇష్టంలేని కేంద్ర ప్రభుత్వం.. క్రూడ్ అయిల్ ధరలు తగ్గిన సమయంలో ఎక్సైజ్ డ్యూటీ పేరుతో అదనంగా విధించిన పన్ను ద్వారా వచ్చిన డబ్బును వినియోగించనుందని తెలస్తుంది. దీంతో పాటు ఇకపై ఎక్సైజ్ సుంకంలో కూడా లీటరుకు మూడు నుంచి నాలుగు రూపాయల మేర కోల్పోయేందుకు సన్నథం అవుతున్నట్లు సమాచారం. లేని పక్షంలో లీటరు పెట్రోల్, డీజిల్ ధరలపై ఏకంగా ఏడు రూపాయల మేర పెంపు తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol  Diesel  Fuel Prices  US dollar  Price hike  OPEC  fuel hike  Oil companies  

Other Articles