రూ. 2000 విత్ డ్రా చేసుకోవాలా.. ఇక్కడికి వెళ్లండి Rs 2000 now you can swipe debit card at Inox theatres for cash

Not just pertrol pumps big bazaar malls now inox theatres too turn into atm centres

inox theatres, card swiping, demonetisation, cash withdrawals, Rs 2000 notes, Rs 2000 notes terrorists, Rs 2000 notes original, banks, ATMs, Rs 500, Rs 1,000, notes exchange, RBI, new Rs 500 notes, Nashik press, Currency Ban, notes ban

After the announcements that people can swipe for cash at petrol pumps and then at Big Bazaar, now multiplex chain Inox also allows people to swipe their debit cards for withdraw Rs 2,000.

రూ. 2000 విత్ డ్రా చేసుకోవాలా.. ఇక్కడికి వెళ్లండి

Posted: 11/26/2016 08:46 PM IST
Not just pertrol pumps big bazaar malls now inox theatres too turn into atm centres

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత.. నగదు కోసం ప్రజలు నానా కష్టాలు పడుతున్న నేపథ్యంలో ఏటీయంలలో డబ్బులు లేక, బ్యాంకుల ముందు క్యా లైన్లు చంతాడంత వున్న నేపథ్యంలో స్వచ్చంధంగా ముందుకు వచ్చాయి పలు మాల్స్, సినిమా థియేటర్లు. ఇప్పటికే పెట్రోలు బంకులలలో కార్డు స్వైప్ చేసిన రెండు వేల రూపాయల నగదును తీసుకునే వెసలు బాటును కేంద్రం కల్పించగా, తాజాగా బిగ్ బజార్ల మాల్ లతో పాటు ఐనాక్స్‌లలో కూడా ఇలాగే కార్డు స్వైప్ చేసి రూ. 2వేలు తీసుకోవచ్చని ప్రకటించారు.

డబ్బులు డ్రా చేసుకోడానికి ప్రజలు బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద ఇబ్బందులు పడుతున్న సమయంలోనే సరిగ్గా బిగ్‌బజార్, ఐనాక్స్ థియేటర్లు ఈ ఆఫర్లతో ముందుకు వచ్చాయి. ఈ రెండు చైన్లతోను తాము ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్టేట్‌బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు నిర్ధారించారు. దాంతో ప్రజలకు మరింత సులభంగా కరెన్సీ నోట్లు అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంటుందన్నారు.
 
బిగ్ బజార్, ఐనాక్స్ ల ద్వారా డబ్బులు పొందడంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కొంతవరకైనా తీర్చేందుకు వీలుంటుందని భావిస్తున్నట్లు ఐనాక్స్ లీజర్ డైరెక్టర్ సిద్దార్థ జైన్ చెప్పారు. ఇక బిగ్‌బజార్లలో తమ మాల్స్ పనిచేసినంత సేపూ డబ్బులు ఇస్తూనే ఉంటామని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. డబ్బులు తీసుకోడానికి వచ్చేవాళ్లు మాల్‌లో ఏమీ కొనాల్సిన అవసరం లేదని.. అది వాళ్ల ఇష్టమని అన్నారు. అలాగే సెంట్రల్, బ్రాండ్ ఫ్యాక్టరీ స్టోర్లన్నింటిలో కూడా ఈ ఆఫర్‌ను అందిస్తున్నారు.

ఇప్పటికీ దేశంలోని పలు ఏటీయంలు గత పక్షం రోజులుగా మూతబడే వుంటున్నాయి. పెద్దనోట్ల రద్దు తరువాత వాటిలో ఇప్పటి వరకు సంబంధిత బ్యాంకు ఏజీన్సలు డబ్బును నిల్వచేయలేదు. ఇక తాజాగా బ్యాంకులకు చేరుతున్న డబ్బులు గంటల వ్యవధిలోనే అయిపోతున్న నేపథ్యంలో బ్యాంకు అధికారులు కూడా ఏటీయం కేంద్రాలలో డబ్బులు పెట్టి అవకాశం లేదనే చెబుతున్నారు. ముఖ్యనగరాలు, పట్టణాలలో అప్పడప్పుడూ డబ్బను పెట్టినా.. అవి కూడా గంటల వ్యవధిలోనే ఖాళీ అవుతున్నాయి. దీంతో ఏటీయం కేంద్రాలకు డబ్బులు నిల్వ చేసే సిబ్బందికి డబ్బు లభించి.. వాటిని ఏటీయంలో పెట్టడం కన్నా పెట్రోల్ బంకులు, మాల్స్, ఇనాక్స్ ధియేటర్లలో అయితే వారి వద్దనున్న డబ్బును ఇచ్చే అవకాశం వుండటంతో కేంద్రం ఈ తరహా చర్యలను తీసుకుందని అంటున్నారు నిఫుణలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : inox theatres  card swiping  big bazaar malls  demonetisation  cash withdrawals  

Other Articles

Today on Telugu Wishesh