దేశాభివృద్ది కోసం ప్రధాని తీసుకున్న బోల్డ్ డిసిషన్: మెగా బ్రదర్ Naga Babu Supports PM Modi’s Demonetisation Decision

Naga babu supports pm modi s demonetisation decision

Naga Babu Supports PM Modi’s Demonetisation Decision, Naga Babu, Naga Babu Supports 500, 1000 Notes Ban, Naga babu Black money, banks, ATMs, Rs 500, Rs 1,000, notes exchange, RBI, new Rs 500 notes, Nashik press, Currency Ban, notes ban, Rs 2,000 note, PM Modi, Narendra Modi, Prime Minister, Facebook, Twitter, War on Black Money, BJP, ATM queues, Bank queue, New Currency Notes, Exchange Old Currency Notes

Tollywood Producer and Actor Naga Babu, wholeheartedly supports Prime Minister Narendra Modi’s decision of demonitising Rs 500 and Rs 1000 Notesban

ITEMVIDEOS: దేశాభివృద్ది కోసం ప్రధాని తీసుకున్న బోల్డ్ డిసిషన్: మెగా బ్రదర్

Posted: 11/21/2016 11:59 AM IST
Naga babu supports pm modi s demonetisation decision

ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయంపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందనలు వెల్లివిరుస్తున్న తరుణంలో.. ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించారు మోగా బ్రదర్ నాగబాబు. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ నిర్ణయంపై నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన తరుణంలో.. నాగబాబు.. ఎలాంటి సందేహం లేకుండా నిర్మోహమాటంగా ప్రధానికి మద్దతు ప్రకటించారు. ప్రధాని తీసుకున్న నిర్ణయం దేశ అభివృద్దికి, పురోగతి దోహదం చేస్తుందని అకాంక్షించారు.

వచ్చే ఎన్నికల నాటికి ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.2 వేల నోటును కూడా రద్దు చేసి, కొత్త నోటు తీసుకు వస్తే స్వచ్ఛమైన ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోదీకి ప్రముఖ నటుడు నాగబాబు విజ్ఞప్తి చేశారు. పెద్దనోట్ల రద్దుపై గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రధానిగా నరేంద్ర మోదీ చరిత్రలో నిలిచారని నాగబాబు కొనియాడారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయం దేశ భవిష్యత్ ను మార్చడం తథ్యమని అన్నారు. ప్రజలందరూ మోదీ తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని కోరారు.

ఇంచుమించు 70 ఏళ్ల తర్వాత ఈ దేశం బాగుపడటానికి తీసుకున్న అద్భుత నిర్ణయం పెద్దనోట్ల రద్దు అని కొనియాడారు. ఈ మేరకు తన అభిప్రాయాలతో కూడిన వీడియో ఇంటర్వ్యూను యూట్యూబ్‌లో పెట్టారు. తాను మోదీ అభిమానిని కాదని, కనీసం బీజేపీ సభ్యుడిని కూడా కాదని, బీజేపీతో తనకు అభిప్రాయభేదాలు ఉన్నాయని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దుపై రాజకీయనాయకులు అసహనం వ్యక్తం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రాజకీయ నాయకులు మోదీపై విమర్శలు మానుకోవాలని నాగబాబు కోరారు.

భారతదేశానికి ప్రస్తుతం స్వాతంత్ర్యం మరి ఎక్కువైపోయిందని, ఇలాంటి సమయంలో నియంతలాంటి నేత దేశానికి అవసరముందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యం నుంచి మంచి మనస్సుతో కఠినమైన నిర్ణయాలు తీసుకొనే నేత రావాలని తాను చిన్నప్పటి నుంచి అనుకునేవాడినని, మోదీ రాకతో అది నెరవేరిందన్నారు. పెద్దనోట్లను రద్దుచేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయంతో తాను కూడా షాక్‌ అయ్యానని, అయితే దీని గురించి ఆలోచిస్తే ఇది మంచి నిర్ణయమో తెలిసిందని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : banks  ATMs  Rs 500  Rs 1  000  mega brother  Naga babu Queues  demonetisation  Reserve bank of India  

Other Articles