బెంగుళూరులో సినీపక్కీలో ప్రోఫెసర్ లక్ష్మీ, అమె భర్త అరెస్ట్.. Medical Professor Lakshmi Arrested In Bengaluru

Medical professor lakshmi arrested in bengaluru

suicide, Guntur, Lakshmi, Sandhya, medical professor, medico sandhya rani suicide, professor lakshmi arrest, vijaya Parthasarathi, bengaluru, harassesment, guntur police, ap special team, high court

The Guntur Medical College professor Dr. Lakshmi was arrested in Bengaluru. She went underground after the PG medico Dr. B. Sandhya Rani committed suicide on October 27.

బెంగుళూరులో సినీపక్కీలో ప్రోఫెసర్ లక్ష్మీ, అమె భర్త అరెస్ట్..

Posted: 11/14/2016 08:59 PM IST
Medical professor lakshmi arrested in bengaluru

డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్య కేసులో నిందితురాలిగా ఉన్న ప్రొఫెసర్ లక్ష్మిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. అధికార పక్షంలోని పెద్దల అండతో పాటు తిన్నింటి అవాసాలను లెక్కించే పోలీసు డిమార్ట్ మెంటుకు చెందిన ఓ అధికారి సహకారంలో బెంగళూరుకు పారిపోయినా.. అక్కడి పోలీసుల సహకారంలో లక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. అమెతో పాటు ఆమె భర్త డాక్టర్ విజయసారథిని పోలీసులు  బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజులుగా బెంగ ళూరులోని ఓ స్నేహితుడి ఇంట్లో ఉన్నట్లు  సమాచారం అందుకున్న ప్రత్యేక పోలీస్ బృందం దాడి చేసి వీరిని అరెస్టు చేసింది. ఇవాళ అర్థరాత్రికి వీరిని గుంటూరు తీసుకరానున్నారు.

బెంగళూరులో స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు.. వారిని సినీపక్కీలో అరెస్టు చేశారు. ఆ దంపతులు ఏటీఎం ద్వారా ఎక్కడ డబ్బులు డ్రా చేసినా పోలీస్ అధికారుల సెల్‌కు మెసేజ్ వచ్చేలా బ్యాంకు అధికారుల సహకారం తీసుకున్నారు. బెంగళూరులోని జయనగర్‌లో ఓ స్నేహితుడి ఇంట్లో మూడ్రోజులుగా ఉన్న వీరు డబ్బులు డ్రా చేయాలని స్నేహితుడి కుమారుడికి ఏటీఎం కార్డు ఇచ్చి పంపారు. అలా డబ్బు డ్రా చేయగానే పోలీసు అధికారి సెల్‌కు మెసేజ్ వచ్చింది.

దీంతో వెంటనే ఏటీఎం సెంటర్ లొకేషన్ కనిపెట్టి ఆ ఏరియా పోలీసులను అలర్ట్ చేసి.. అతన్ని వెంబడించి  అతను ఇంట్లోకి వెళ్లగానే పోలీసులు ఆ గృహాన్ని చుట్టుముట్టి దాడి చేశారు. లక్ష్మి దంపతులు అక్కడే ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు.ఓ పోలీసు ఉన్నతాధికారి లక్ష్మి దంపతులకు తమ కదలికలను ఎప్పటికప్పుడు చేరవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి తోడు అధికార నేతల అండదండలు కూడా పుష్కలంగా ఉండటంతో చివరకు వీరిని పట్టుకోవడానికి పోలీసులకు 22 రోజులు పట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles