గాంధీ బుల్లి సాయం చావు బతుకుల మధ్య | Gandhiji’s grandson Kanu Gandhi battle with life.

Gandhiji s grandson kanu gandhi battle with life

Kanu Ram Das Gandhi, Gandhiji’s grandson and ex-Nasa scientist, Kid who participate in Dandi Yatra with Gandhi, Kanu Ram Das with Gandhi, Gandhi Grand son Modi

Kanu Gandhi, Gandhiji’s grandson and ex-Nasa scientist, battles death in penury.

చరిత్ర సజీవసాక్ష్యాన్ని కాపాడే నాథుడేడి?

Posted: 11/05/2016 08:44 AM IST
Gandhiji s grandson kanu gandhi battle with life

అది 1930 మార్చి-ఏప్రిల్ సమయం చారిత్రక దండి ఉప్పుసత్యాగ్రహం నిర్వహించాడు మోహన్ దాస్ కరం చంద్ గాంధీ. గుజరాత్ దండి సముద్ర తీరంలో మహాత్ముడు ముందు నడుస్తుంటే జనం ఆయన వెంట కదిలి వచ్చారు. కానీ, గాంధీ కంటే ముందుండి ఆయనే నడిపించాడు మరో వ్యక్తి. అతనే గాంధీ మనవడు కానూ రాందాస్ గాంధీ. పదేళ్ల కుర్రాడు గాంధీ చేతిలోని కర్రను పట్టుకుని ఆయన్ని నడిపించాడు. ఆ ఫోటో ఇప్పటికీ చరిత్రలో పదిలంగా నిలిచిపోయింది. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు మరణశయ్యపై ఉంటే ఎవరికీ పట్టదా?

ప్రస్తుతం ఆయన వయసు 96 ఏళ్లు. చరిత్ర లో నిలిచిపోయే ఉద్యమానికి సజీవ సాక్షిగా నిలిచిన ఆయన ప్రస్తుతం అత్యంత దుర్భర స్థితిలో ఆస్పత్రి బెడ్‌పై దయనీయంగా ఉన్నారు. జాతిపిత గాంధీ మనవడిగానే కాదు, నాసా శాస్త్రవేత్తగా ఘన చరిత్ర ఉన్న ఆయన పట్టించుకునేవారు లేకపోవటంతో సూరత్‌లోని ఓ ట్రస్ట్ ఆస్పత్రిలో చివరి రోజులు గడుపుతున్నారు. ఆయన వెంట భార్య శివలక్ష్మి(90) తప్ప నా అన్న వారెవరూ లేరు.

బాపూజీ మనవడిగా కంటే ఆయన సన్నిహితుడిగానే చాలామందికి కానూ పరిచయం. గాంధీ వ్యక్తిగత అవసరాలను ఆయనే స్వయంగా చూసుకునేవారు. స్వాతంత్ర్యానంతరం భారత్‌లో అప్పటి అమెరికా రాయబారి జాన్ కెన్నెత్ సాయంతో మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యనభ్యసించిన కానూ గాంధీ తర్వాత నాసా, అమెరికా రక్షణ శాఖలో ఉద్యోగం చేశారు. ఆ సమయంలోనే మెడికల్ రీసెర్చర్ అయిన శివలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం లేదు. 40 ఏళ్లు అమెరికాలో ఉన్న కానూ దంపతులు రెండేళ్ల క్రితం తిరిగి భారత్ చేరుకున్నారు.

Kanu ram das

భారత్‌లో వారికి సొంతిల్లు లేకపోవడంతో కొన్నాళ్లు ఆశ్రమాలు, సత్రాల్లో గడిపారు. ఉద్యోగంలో సంపాదించినది దానధర్మాలకు ఇచ్చేయడంతో చేతిలో చిల్లిగవ్వలేని దీనస్థితికి చేరుకున్నారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కానూ గాంధీ పక్షం రోజులుగా సూరత్‌లోని రాధాకృష్ణన్ ఆలయం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు వైద్య చికిత్సలు అందిస్తూనే భార్యాభర్తలను దగ్గరుండి చూసుకునేందుకు ఆస్పత్రి ఓ యువకుడిని నియమించింది.

కానూ చిన్ననాటి స్నేహితుడైన దీమంత్ బధియా(87) విషయం తెలిసి ఇటీవల కొంత సాయం అందించారు. ముంబై, బెంగళూరుల్లో నివసిస్తున్న కానూ సోదరీమణులు కూడా వయసు మీదపడడంతో కదిలే పరిస్థితి లేదు. దీంతో ఫోన్లోనే సోదరుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం కానూ దీనావస్థను తెలుసుకున్న ఓ కేంద్రమంత్రి విషయాన్ని ప్రదాని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. కానూకు సాయంపై మోదీ హామీ ఇచ్చినట్టు తెలిసింది. అయితే గుజరాత్ మంత్రులెవరూ ఇప్పటి వరకు కానూవైపు కన్నెత్తి కూడా చూడలేదని బధియా ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబరు 22న కానూకు గుండెపోటు వచ్చింది. ఫలితంగా పక్షవాతం వచ్చి ఎడమవైపు శరీరం భాగం చచ్చుబడిపోయింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు.

Kanu Ramdas gandhi

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahatma Gandhi  Grandson  Kanu Ram Das  Ventilate  

Other Articles