సైనాను రిటైర్ మెంట్ అయ్యేలా ఉసిగొల్పిందెవరు? | Saina Nehwal feels her career is over

Saina nehwal feels her career is over

Saina Nehwal retirement, saina announcement, saina nehwal retirement, star shetler saina nehwal, former number one shuttler saina nehwal, saina nehwal vs PV sindhu, saina retirement, saina nehwal injure, hyderabadi shuttler saina nehwal

Saina Nehwal feels her career is over. Somewhere deep in my heart, maybe it is the end of my career she added.

సైనా నెహ్వాల్ షాకింగ్ డెషిషన్

Posted: 11/03/2016 07:45 AM IST
Saina nehwal feels her career is over

స్టార్ షట్లర్ 2012 లండన్ ఒలంపిక్స్ కాంస్య పతక విజేత, సైనా నెహ్వాల్ రిటైర్మెంట్ యోచనలో ఉందా? కోలుకోలేని గాయంతో బాధపడుతున్న ఆమె కెరీర్ 26 ఏళ్లకే ముగిసినట్లేనా? తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

రియో ఒలింపిక్స్ నుంచి మోకాలి గాయంతో లీగ్ దశలోనే నిష్కృమించిన సైనా ఈనెల 15 నుంచి జరగనున్న చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఈ సందర్భంగా గెలుపు పై మీడియా ఆమెను ప్రశ్నించగా...భవిష్యత్ లక్ష్యాలను తానేమీ నిర్దేశించుకోలేదని తెలిపింది. చాలామంది తన కెరీర్ ముగిసిందని చెబుతున్నారని, గుండె లోతుల్లోంచి ఆలోచిస్తే తనకూ అలాగే అనిపిస్తోందని పేర్కొంది. అయితే మున్ముందు ఏం జరుగుతుందో చూద్దామని నర్మగర్భంగా వ్యాఖ్యానించింది.

సాధ్యమైనంత ఎక్కువగా కష్టపడాలని అనుకుంటున్నానని, అయితే నా పని అయిపోయిందని అందరూ అనుకుంటున్నారని పేర్కొంది. వారు అలా అనుకోవడం తనకు సంతోషమేనని తెలిపింది. ఇక నుంచి వారు తన గురించి ఆలోచించడం మానేస్తారేమోనని పేర్కొంది. వచ్చే ఏడాది, ఆ మరుసటి ఏడూ... అంతే. మరో ఐదారేళ్లు కెరీర్ కొనసాగించాలన్న నిర్ణయం తనకు మాత్రం లేదు అని చెప్పింది.

లండన్ ఒలంపిక్స్ లో కాంస్య పతకంతోపాటు, ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటెన్ లో ఫైనల్ కి చేరిన తొలి భారతీయ మహిళగా, ఎక్కువ కాలం వరల్డ్ నంబర్ 1 స్థానంలో కొనసాగిన షట్లర్ గా ఈ హైదరాబాదీ సంచలనం రికార్డు నెలకొల్పింది. ఇక రియో ఒలంపిక్స్ లో గాయంతో వైదొలిగాక భయంతోనే ఆమె వైదొలిగిందన్న విమర్శలు చెలరేగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad shutler  Saina Nehwal  retirement plan  

Other Articles