బార్డర్ చరిత్రలో ఇదే తొలిసారి | Pak Posts Destroyed After 8 Civilians Killed In India

Pak posts destroyed after 8 civilians killed in india

8 Civilians Killed border, 14 Pakistan Posts Destroyed, 60 ceasefires Pak, India Pak border, 2 Pak rangers killed, 2 Pak soldiers killed

14 Pakistan Posts Destroyed After 8 Civilians Killed In India.

ఇండో-పాక్ బార్డర్ లో ఇదే తొలిసారి

Posted: 11/02/2016 07:18 AM IST
Pak posts destroyed after 8 civilians killed in india

భారత్ వెన్ను చూపకుండా పోరాడుతున్నప్పటికీ, పాకిస్థాన్‌ మళ్లీ మళ్లీ రెచ్చిపోతుంది. ప్రతీకారంతో రగిలిపోతున్న దాయాది.. సరిహద్దు గ్రామాలపై గుళ్ల వర్షం కురిపించింది. జమ్మూ కశ్మీరులోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న సాంబా, జమ్ము, పూంచ్‌, రాజౌరీ జిల్లాల్లో సైనిక శిబిరాలు, శివారు గ్రామాలపై మొదటిసారిగా 82 ఎంఎం, 120 ఎంఎం భారీ మోర్టారు బాంబులను ప్రయోగించింది. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది పౌరులు మరణించారు. 22 మంది గాయపడ్డారు. గత రెండు దశాబ్దాల్లో సరిహద్దుల్లో ఒకేరోజున ఇంతమంది పౌరులు చనిపోవడం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు.

ఎటువంటి కవ్వింపు చర్యలూ లేకుండానే తుపాకులు, మోర్టారు బాంబులతో విరుచుకుపడింది. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులే. రామ్‌గఢ్‌ సెక్టార్లో ఐదేళ్ల చిన్నారులు రేషబ్‌, అభి, 19 ఏళ్ల రవీందర్‌ కౌర్‌ మరణించారు. రామ్‌గడ్‌ సెక్టార్లో ఐదుగురు మరణించారని, తొమ్మిదిమంది గాయపడ్డారని సాంబా డిప్యూటీ కమిషనర్‌ షీతల్‌ నందా తెలిపారు. గుళ్ల వర్షం కురుస్తుండడంతో షాక్‌కు గురై మరొక వ్యక్తి మరణించారని తెలిపారు. ఒకవైపు, మోర్టారు బాంబులను ప్రయోగిస్తూనే, మరోవైపు తుపాకులతో కాల్పులు జరిపారని వివరించారు. రాజౌరీ జిల్లాలో ఇద్దరు మహిళలు మరణించారు. దాంతో, భారత దళాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి.

ఈ కాల్పుల్లో ఇద్దరు పాకిస్థానీ సైనికులు మరణించారు. 14 పాకిస్థాన్‌ స్థావరాలు ధ్వంసమయ్యాయి. కాగా, జమ్మూ కశ్మీరు గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోరా మంగళవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. సరిహద్దుల్లోని ప్రస్తుత పరిస్థితిని వివరించారు. కాగా, సరిహద్దు కాల్పులపై రక్షణ మంత్రి మనోహర్‌ పరీకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత దోవల్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ దల్బీర్‌ సింగ్‌తో కలిసి హోంమంత్రి రాజ్‌నాథ్‌ సమీక్షించారు. ఎట్టి పరిస్థితుల్లో వారిని ఉపేక్షించాల్సిన అవసరం లేదని రాజ్ నాథ్ గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక ఈ నెల రోజుల్లో పాక్ 60 ఉల్లంఘనలకు పాల్పడింది. భారత సర్జికల్‌ దాడులు చేసిన సెప్టెంబరు 29వ తేదీ నుంచి ఇప్పటి వరకు దాడులు చేయటంతో 15 మంది మరణించారు. 45 మంది గాయపడ్డారు. సాయుధ ఉగ్రవాదులను చొప్పించడానికి పాకిస్థాన్‌ ప్రయత్నిస్తూనే ఉంది. ఆఖరికి దీపావళి రోజు రాత్రి కూడా ముగ్గురు ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించగా, వారిని బీఎ్‌సఎఫ్‌ దళాలు పట్టుకున్నాయి. ఇందుకు ప్రతీకారంగానే సరిహద్దుల్లో భారీగా కాల్పులు జరుపుతూనే ఉంది. వాటికి బీఎ్‌సఎఫ్‌ దీటుగా బదులిస్తోంది.

ఇదిలా ఉండగా, భారతలోని దౌత్య కార్యాలయంలో పనిచేస్తున్న నలుగురు అధికారులను ఉపసంహరించాలని పాకిస్థాన్‌ యోచిస్తోంది. గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడడంతో ఢిల్లీలోని పాక్‌ దౌత్య కార్యాలయంలో పని చేస్తున్న మెహబూబ్‌ అఖ్తర్‌ను భారత బహిష్కరించిన నేపథ్యంలో పాకిస్థాన్‌ ఈ విషయాన్ని పరిశీలిస్తోంది. అయితే పోతూ పోతూ మరో 16 మంది గూఢచారులు ఉన్నారంటూ మోహబూబ్ బాంబు వేసి పోవటంతో అధికారులు వారిని కనిపెట్టే పనిలో పడ్డారు.

రివర్స్ దాడి...
ఎటువంటి కవ్వింపు చర్యలూ లేకుండానే సరిహద్దుల్లో ‘కాల్పుల విరమణ ఉల్లంఘన’లకు పాల్పడుతున్నారంటూ భారత డిప్యూటీ హై కమిషనర్‌ జేపీ సింగ్‌ను పిలిచి పాకిస్థాన్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈమేరకు పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబరు 31న భారత జరిపిన కాల్పుల్లో ఆరుగురు పౌరులు మరణించారని, ఈ ఘటనను పాక్‌ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని హితవు పలికింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indo-pak border  8 Civilians Killed  

Other Articles

Today on Telugu Wishesh