పొరపాటున జైలుపై బాంబు వేశారు... 60 మంది మృతి | Saudi-Led Airstrikes on Yemen Prison Kill at Least 60

Saudi led airstrikes on yemen prison kill at least 60

Saudi-Led Airstrikes, Yemen Prison Kill at Least 60, Airstrikes on Jail, Houthi Yemen, Saudi air attacks Jail, Saudi attack Yemen

Saudi-Led Airstrikes on Yemen Prison Kill at Least 60, Dozens more wounded after attack on Houthi-controlled city on the western coast.

ఇంటి మీద బాంబులు పడతాయన్న భయంతో...

Posted: 10/31/2016 08:03 AM IST
Saudi led airstrikes on yemen prison kill at least 60

క్షణ క్షణం అక్కడ జనాలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. బయటికి వస్తే ఎవరు కాల్చి చంపుతారో? ఎటు నుంచి బాంబులు తమ ఇళ్ల మీద పడతాయో తెలీక రెండేళ్లుగా ఆ దేశ ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఇదంతా రిపబ్లిక్ ఆఫ్ యెమెన్ గురించి...

అరబ్ కంట్రీల్లో భాగంగా ఉన్న యెమెన్ పై ఇప్పుడు దాడులు తీవ్రతరమయ్యాయి. యెమెన్ లోని అల్-హోదీదాలోని ఓ జైలుపై సౌదీ సంకీర్ణ భద్రతా దళాలు జరిపిన వైమానిక దాడుల్లో ఏకంగా 60 మంది దుర్మరణం చెందారు. వీరిలో ఖైదీలతో పాటు, జైలు సిబ్బంది కూడా ఉన్నారు. అంతేకాకుండా, మరో 38 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. శనివారం అర్ధరాత్రి సౌదీ అరేబియా ఈ దాడులు జరిపింది. ఆదివారం నాడు కూడా హోదీదా గగనతలంపై సౌదీ జెట్ ఫైటర్లు ఎగురుతూనే ఉన్నాయి. అక్కడ పరిస్థితి ఇంకా యుద్ధ వాతావరణంలోనే ఉండటంతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

2014లో షితే ఇస్లాం వర్గాల ఉద్యమం చేస్తున్న హౌతీలకు మద్ధతు ఇచ్చి అధ్యక్షుడు అబిద్ హదీని దేశం విడిచి పారిపోయేలా చేసింది ఇరాన్. దీంతో రంగంలోకి దిగిన సౌదీ అరేబియా అమెరికాతోపాటు మిత్రపక్షాల సహకారంతో యెమెన్ లో తిష్ట వేసిన హౌతీ రెబల్స్ ను టార్గెట్ చేసి దాడులు చేస్తోది. ఈ క్రమంలో తాజా దాడి జరిగినట్లు సమాచారం. ఈ జైలు నుంచే హౌతీ తమ కార్యాచరణను అమలు చేస్తుందన్న అనుమానంతో వైమానిక దాడులు చేయగా, ఖైదీలు బలయ్యారని యూఎన్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, మొత్తం మీద 140 సాధారణ పౌరులు ఈ దాడుల్లో బలయ్యారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saudi Arabia  Hauthi  Yemen  prison  60 killed  

Other Articles