‘పశ్చిమ్ లహర్’తో ఇండియన్ నేవీ విన్యాసాలు Amid Indo-Pak tension, Navy plans major drill

Amid indo pak tension navy plans major drill

Indian Navy,cross-border clashes,pakistan,mobilising vessels,defence forces,major combat drill,arabian sea,Paschim Leher (western wave),Indian defence ministry,border clashes

Amid continued cross-border firing between India and Pakistan, and the killing of innocent civilians as well as soldiers, the Indian Navy is mobilising its troops and vessels for a major combat exercise, dubbed "Paschim Leher" (western wave) in the Arabian Sea.

‘పశ్చిమ్ లహర్’తో ఇండియన్ నేవీ విన్యాసాలు

Posted: 10/29/2016 07:59 PM IST
Amid indo pak tension navy plans major drill

సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత ఆర్మీ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధమౌతోంది. సర్జికల్ దాడుల అనంతరం పాక్ వైపు నుంచి కాల్పుల ఉల్లంఘనలు పెరగడంతో పాటు.. గురువారం ఉదయం నుంచి పాక్ సైన్యం ఎల్‌ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారీ స్ధాయిలో కాల్పులకు దిగుతోంది. ఈ దాడులను భారత సైన్యం ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొడుతూనే ఉంది. అయితే నవంబర్‌ చివర్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ పదవికాలం ముగియనుండటంతో.. ఈ లోపు పాక్ ఏదైనా దుందుడుకు చర్యలకు పాల్పడే అవకాశం లేకపోలేదని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

దీంతో భారత సైన్యం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఆర్మీ, వాయుసేన పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండగా.. ఇప్పుడు ఇండియన్ నేవి సైతం అరెబియా సముద్రంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ.. పాకిస్తాన్ కాలుదువ్వితే.. భరతం పడతమన్నట్లగా వ్యవహరిస్తుంది. 'పశ్చిమ్‌ లెహర్' పేరుతో భారీస్థాయిలో విన్యాసాలకు సిద్ధమౌతోంది. 40కి పైగా వార్‌షిప్‌లు, సబ్‌మెరైన్‌లు, మెరిటైమ్ ఫైటర్ జెట్‌లు, గస్తీ ఎయిర్ క్రాఫ్ట్స్, డ్రోన్‌లతో నౌకాదళం ఈ విన్యాసాలను నవంబర్ 2 నుంచి 14 వరకు నిర్వహించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian navy  drill  paschim leher  arabian sea  pakistan  

Other Articles

Today on Telugu Wishesh