మానవత్వంతో మహిళ ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే రోజా | YSRCP MLA Roja saves accident woman in Tirupathi

Ysrcp mla roja saves accident woman in tirupathi

Roja saves life, MLA Roja saves accident victim, Roja saves life, MLA Roja saves life, MLA roja save accident victim, Roja MLA, Nagari MLA Roja

YSRCP MLA Roja saves accident woman and admit her in hospital in Tirupathi.

రోజాలో ఈ కొత్త యాంగిల్ చూశారా?

Posted: 10/28/2016 02:57 PM IST
Ysrcp mla roja saves accident woman in tirupathi

ఛాన్స్ దొరికినప్పుడల్లా తెలుగు దేశం ప్రభుత్వాన్ని, అధినేత, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడిని అవసరమైతే కాస్త ఘాటైన పదజాలాన్నే వాడి విమర్శలు చేస్తుంది వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఫైర్ బ్రాండ్ అయిన ఈ నగరి ఎమ్మెల్యే సినిమాటిక్ డైలాగులతో, బాబు, తనయుడు లోకేష్ లను ఏ రేంజ్ లో ఏకీ పడేస్తుందో మనందరికీ తెలుసు. తనపై బ్యాన్ వేసిన సమయంలో కూడా చెక్కుచెదరని ధైర్యంతో విమర్శలు చేసిన ఘనత రోజాది. అందుకే జగన్ కూడా ఆమె ఉపోధ్ఘాతానికి ఏనాడూ అడ్డుచెప్పిన దాఖలాలు లేవు.

అలాంటి రోజాలో మానవతా కోణం ఈ రోజు ఆవిష్కృతమైంది. సాధారణంగా సినిమాల్లో రోడ్డుపై గాయపడిన వారిని లీడర్లుగా ఉండే నేతలు ఆసుప‌త్రికి త‌ర‌లించి బాధితుడిని కాపాడే ఘ‌ట‌న‌లు చూస్తుంటాం. అయితే కానీ అటువంటి ఘ‌ట‌నే ఈరోజు తిరుపతివాసులు రియల్ గా చూశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తిరుప‌తి స‌మీపంలోని పాకాల మండలం నేండ్రగుంట వద్ద ఈ రోజు ఉద‌యం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ మహిళను చూడటమే కాదు, సకాలంలో స్పందించి ఆ ప్రాణాన్ని కాపాడింది కూడా.

స్కూటీపై వెళుతూ కిందపడిపోవడంతో సింధు అనే మ‌హిళ ఈ ప్ర‌మాదానికి గురైంది. దీంతో రోజా త‌న‌ కారును ఆపి, ఆమెను ఎక్కించుకుని పూతపట్టులోని ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. సింధుకి స‌కాలంలో వైద్యం అందడం మూలంగానే ప్రాణాలు నిలిచాయని వైద్యులు చెప్పటంతో ఆమె తల్లిదండ్రులు రోజాకి కృతజ్నతలు చెప్పారు. మనకెందుకులే అని వాళ్లలాగా చూసుకుంటూ వెళ్లిపోకుండా, నిజమైన ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన ఆమె తీరును స్థానికులంతా అభినందించలేకుండా ఉండలేకపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP MLA Roja  saves accident woman  Tirupathi  

Other Articles