యజమాని అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన రామచిలుక..! pet parrot exposes husband's affair with housemaid

Pet parrot exposes husband s affair with housemaid

parrot exposes owner's affair, pet parrot, affair, Kuwait, expose affair, husband affair, owner-housemaid affair, Hawally police station, credible evidence, Adultery

A pet parrot in Kuwait exposed an affair by repeating flirty phases exchanged between a husband and housemaid in front of the wife.

యజమాని అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన రామచిలుక..!

Posted: 10/27/2016 11:17 AM IST
Pet parrot exposes husband s affair with housemaid

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేరని పెద్దలంటారు. కానీ ఇంటి యజమానే దొంగ వేషాలు వేస్తు.. మరెవరు పట్టుకుంటారు.? యజమాని చేస్తున్న దొంగ నాటకాలు నిజం కావాల్సిందేనా.? మీకు అర్ధమైనట్లు లేదు.. ఇంట్లో ఓ రామచిలుక వుంటే చాలు. సంబంధం లేకుండా మాట్లాడుతారేం..? అంటారా.? ఇంట్లోని వ్యక్తుల మధ్య వుండాల్సిన నమ్మకాలను కాదని వారితో ఒకలా వుంటూ వారి వెనక మరోలా ప్రవర్తించే మనుషులు ఈ మధ్యకాలంలో అధికమైపోయారు. భార్య భర్తల మధ్య అనుబంధానికి, అనురాగానికి మధ్య కేవలం బిజినెస్ తరహాలో సంసార జీవనాలు సాగిస్తున్న వారు కూడా లేకపోలేదు. ఇలాంటి నేపథ్యంలో భార్య ఇంట్లో లేని పమయాల్లో భర్తలు చేసే వెర్రి వేషాలను తెలుసుకోవాలంటే.. ఇంట్లో రామచిలుక వుంటే చాలు.

మాటలు నేర్చిన రామచిలుక ఇంట్లో ఉంటే ఆ ఆనందమే వేరు. మనం మాట్లాడిన మాటల్నే ముద్దుముద్దుగా అది వల్లేవేస్తుండటమే కాదు.. ఇంట్లో జరిగినే వెదవ వేషాల గుట్టును రట్టుచేయడానికి కూడా రామచిలుక అవసరం వుందని ఈ ఘటన మనకు తెలియజేస్తుంది. ఏకంగా తన ఇంటి ఆసామి బండారం బట్టబయలు చేసింది. పనిమనిషితో రహస్యంగా శృంగారలీలలు జరుపుతూ.. ఆమెతో ఆయన చెప్పిన ముద్దుముద్దు మాటల్ని ఆ చిలుక భార్య ముందు పలికేసింది. దాంతో పనిమనిషితో ఆయన జరుపుతున్న రహస్య రాసలీలలు బట్టబయలయ్యాయి. దీంతో ఇప్పుడాయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ ఘటన కువైట్‌లో జరిగింది. పనిమనిషితో భర్త రహస్యంగా జరుపుతున్న రాసలీలల గురించి పెంపుడు చిలుక గుట్టువిప్పడంతో భార్య ఆయన మీద కేసు పెట్టింది. వారిద్దరి రహస్యంగా మాట్లాడుకున్న మాటల్ని చిలుక పదేపదే వల్లే వేయడంతో వారిపై తనకు అనుమానం కలిగినట్టు హవాల్లి పోలీసు స్టేషన్‌లో చేసిన ఫిర్యాదులో పేర్కొంది. భర్త తనను మోసం చేస్తున్నాడని తనకు చాలాకాలంగా అనుమానంగా ఉందని, చిలుక మాటలతో ఈ అనుమానం నిజమైందని తెలిపింది.

తాను ఆఫీసు నుంచి త్వరగా వస్తే భర్త ఆశ్చర్యపోతున్నాడని, కుంగిపోయి కనిపిస్తున్నాడని ఆమె పేర్కొంది. అయితే, చిలుక చెప్పిన విషయాల ఆధారంగా కేసు నమోదుచేయలేమని పోలీసులు అంటున్నారు. టీవీలో రాసలీలల దృశ్యాలు చూసి.. ఆ మాటల్ని చిలుక వల్లేవేస్తూ ఉండవచ్చునని, చిలుక మాటల ఆధారంగా నేరాన్ని నిరూపించడం కష్టమని పోలీసులు అంటున్నారని అరబ్‌ టైమ్స్‌ పత్రిక  ఓ కథనంలో పేర్కొంది. గల్ఫ్‌ దేశాల్లో అక్రమ సంబంధం కలిగి ఉండటం నేరం. ఈ నేరం రుజువైతే కఠినమైన జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : parrot  affair  Kuwait  expose affair  Adultery  

Other Articles