ఫ్లాట్ఫామ్ లు మళ్లీ బాదేశాయోచ్.. Platform ticket to cost double during festival

Platform ticket to cost double during festival

South Central Railway, announcement, platform tickets, Secunderabad Railway station, Railway platform tickets rates doubled, temporary inrease in platform tickets, hike in platform tickets

The South Central Railway has announced that from September 30 to Oct. 12, platform tickets for entry into Secunderabad station will be doubled, from the current price of Rs. 10.

ఫ్లాట్ఫామ్ లు బాదేయనున్నాయోచ్..!

Posted: 09/28/2016 09:09 PM IST
Platform ticket to cost double during festival

పండుగ పూట తమ కన్నవాళ్లు, అన్నదమ్ములు, చిన్ననాటి స్నేహితులతో సొంత ఊళ్లలో సంబరాలు అంబరాన్ని అంటే విధంగా చేసుకోవాలని ఏడాది కాలంగా ఎదురుచూసే దక్షిణాది ప్రజలకు కేంద్ర ప్రభుత్వం వాయించేయనుంది. పండగ పూట సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులనే కాదు.. వారిని దింపేందుకు రైల్వే స్టేషన్లకు వెళ్లే బంధుమిత్రల జేబులకు కూడా కత్తెర పడనుంది. రైల్వే స్టేషన్లోకి వెళ్లాలంటే అత్యంత అవసరమైన ఫ్లాట్ ఫామ్ టిక్కట్ల ధరల పేరుతో లోనికి ప్రవేశించే వారి పర్సులను ఖాళీ చేయాలని చూస్తుంది. అధికారంలోకి వచ్చి రాగానే ఫ్లాట్ ఫామ్ ధరను ఐదు రూపాయల నుంచి 10 రూపాయలకు పెంచిన కేంద్రం.. మళ్లీ అలాంటి చర్యలను తాత్కాలికంగా తీసుకోనుంది.

రద్దీ పేరుతో రైల్వే శాఖ కూడా ప్రయాణికుడిపై బాదుడు షురూ చేసింది. దసరా, దీపావళి సందర్భంగా సెలవుల దృష్ట్యా రైల్వేశాఖ అదనపు చార్జీల పేరుతో ప్రయాణికుడిపై ముప్పేట దాడికి పాల్పడుతోంది. ఈ పండుగల ఎఫెక్ట్తో దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుతం రూ.10 ఉన్న ఫ్లాట్ఫాం టికెట్ ధర ఇప్పుడు రూ.20కు పెంచింది.  ఈ నెల 30 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకూ ఈ పెంపు అమల్లో ఉంటుంది. ఇక పండగొచ్చిందంటే చాలు.. రైల్వేశాఖ రెట్టింపు అదనపు చార్జీలతో ప్రయాణికులను వీరబాదుడు బాదుతోంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles