హైకోర్టు అదేశాలతో మలుపు తిరిగిన ఎస్ఐ రామకృష్ణ ఆత్మహత్యకేసు medak si ramakrishna reddy suicide case took key turn

Medak si ramakrishna reddy suicide case took key turn

SI Ramakrishna reddy, medak si suicide case, dsp sridhar, ci medak, high court, si suicide note, Police quarters, Gajwel area hospital, suicie, kukunoorpally police station, shot dead, medak district,

high court orders to book case against dsp sridhar and ci in medak district kukunoorpally police station si ramakrishna reddy suicide case as he mentioned their names in suicide note

హైకోర్టు అదేశాలతో మలుపు తిరిగిన ఎస్ఐ రామకృష్ణ ఆత్మహత్య కేసు

Posted: 09/16/2016 01:59 PM IST
Medak si ramakrishna reddy suicide case took key turn

తెలంగాణలో సంచలనం రేపిన మెదక్‌ జిల్లా కుకునూరుపల్లిలో ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి (45) ఆత్మహత్య కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో మెదక్ డీఎస్పీ శ్రీధర్, సీఐపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని హైకోర్టు అదేశాలు జారీ చేయడంతో ఈ కేసు కొత్త మలుపు తీసుకుంది. తన భర్త ఆత్మహత్య కేసులో సిబీఐ విచారణ జరపాలని మృతుడు రామకృష్ణారెడ్డి భార్య హైకోర్టు ఆశ్రయించడంతో విచారణ జరిపిన రాష్ట్రోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులను జారీచేసింది. డీఎస్పీ శ్రీధర్, సీఐ వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు రామకృష్ణారెడ్డి సూసైడ్ నోట్ లో పేర్కొన్నా.. వారి పేర్లను ఎఫ్ ఐ ఆర్ లో ఎందుకు నమోదు చేయలేదని న్యాయస్థానం నిలదీసింది.

గత నెల 17న పోలీస్‌ క్వార్టర్స్‌లో తీవ్ర మనస్థాపానికి గురైన రామకృష్ణారెడ్డి అధికారుల వేదింపులు తాళలేక.. తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన సహచర ఎస్ఐకి ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. అది విన్న సహచర మిత్రుడు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని, తాను వెంటనే వస్తున్నానని చెప్పి.. అతను పోలిస్ క్వార్టర్స్ కు చేరుకునే లోపు రామకృష్ణారెడ్డి తన రివాల్వర్ తో కాల్చుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు.

సంఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ లభ్యంకాగా, అందులో ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు. తాను ఉద్యోగం మానేస్తానని క్రితం రోజు రాత్రి భార్యకు రామకృష్ణారెడ్డి ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు. దీంతో తన భర్త ఉన్నతాధికారుల వేధింపుల వల్లే మరణించాడని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని అమె హైకోర్టును ఆశ్రయించారు. ఎస్‌ఐ రామకృష్ణారెడ్డిది నల్లగొండ జిల్లా, మఠంపల్లి మండలం బక్కమంత్రగూడెం స్వస్థలం, ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SI Ramakrishna reddy  medak si suicide case  dsp sridhar  ci medak  high court  si suicide note  

Other Articles