మన దేశానికి చెందిన పలువురు సెలబ్రీటీలు, వ్యాపార వేత్తల ప్రపంచంలో అత్యధిక సంపన్నుల జాబితాలోనో లేక అత్యంత ప్రభావిత వ్యక్తులుగా చోటు సంపాధించుకోవడంలో అశ్చర్యమేమీ లేదు. కానీ మన బాలీవుడ్ అందాల బామలు కూడా ప్రఖ్యాత ‘ఫోర్బ్స్’ మేగజీన్ ఈ ఏడాదికి గాను స్థానాన్ని సంపాదించారు. అయితే వీరు ఈ స్థానం వచ్చింది వారి నటనకో లేక సినిమాలకో అనుకుంటే పోరబాటే. వీరికి ఈ అరుదైన గౌరవాన్ని అందించింది మాత్రం బుల్లితెర. ప్రపంచంలో అత్యధిక సంపాదన ఉన్న టీవీ నటీమణుల జాబితాలోబాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే స్థానం సంపాదించారు.
హాలీవుడ్ లో బుల్లితెరపై కనిపిస్తున్న ఈ నటీమణులు ఇటు సినీ కెరీర్ ను కూడా క్రమబద్దంగా కొనసాదిస్తున్నారు. దీంతో అత్యంత అధికంగా సంపాదించిన వారిగా వీరు ఫోర్భ్స్ జాబితాలో స్థానాన్ని సంపాదించారు. 15 మంది ఉన్న ఈ జాబితాలో 8వ స్థానంలో నిలిచిన ప్రియాంక... ఈ ఘనత సాధించిన తొలి భారతీయనటిగా రికార్డు సృష్టించింది. అమెరికా టీవీ షో క్వాంటికో ద్వారా గతేడాది అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టిన ప్రియాంక దాదాపు రూ.73.72 కోట్లు (11 మిలియన్ డాలర్లు) సంపాదించినట్టు ఫోర్బ్స్ వెల్లడించింది.
కాగా దీపికా పదుకునే కూడా హాలీవుడ్ టీవీ తెరపై కనిపించేందుకు రంగం సిద్దమైంది. డిజే కారుసో దర్శకత్వంలో వస్తున్న వెంచర్ త్రిబుల్ ఎక్స్ ద్వారా దీపికా అడుగుపెట్టనుంది. అయితే ఇందుకు గాను ఇప్పటికే పేమెంట్ అందుకున్న దీపికా ఈ ఏడాది పది మిలియన్ డాలర్లను సంపాదించింది ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించింది. అమెరికా నటి సోఫియా వెర్గారా రూ.288.18 కోట్ల (43 మిలియన్ డాలర్లు)తో వరుసగా ఐదోసారీ తొలిస్థానంలో నిలిచింది.
సూపర్ హిట్ టీవీ షో... మోడరన్ ఫ్యామిలీలో వెర్గారా చేస్తోంది. వీటితో పాటు ఎండార్స్మెంట్లు తదితరాల ద్వారా ఇంత మొత్తాన్ని సంపాదించింది. రూ.160.84 కోట్ల ఆదాయంతో కాలె కువాకో, రూ.100.53 కోట్లతో మిన్డీ కాలింగ్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. రూ.97 కోట్ల చొప్పున ఎలెన్ పాంపియో, మరిస్కా హర్గిటే సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచారు. శాండల్ నటి కెర్రీ వాషింగ్టన్ (రూ.90.47 కోట్లు) ఆరో స్థానంలో ఉన్నారు. అయితే... హాలీవుడ్లో హీరోలతో పోలిస్తే హీరోయిన్ల సంపాదనలో ఎంతో వ్యత్యాసం ఉందని, దీన్ని వారు చేరుకోవాలంటే చాలా శ్రమించాల్సి ఉందని మేగజీన్ పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more