కాబోయే భార్యభర్తలను విడదీసిన శునకం woman turned down marriage proposal because of dog!

Woman turned down marriage proposal because of dog

woman turns down marriage proposal, woman turns down marriage for dog, womans love for her dog tuns down marriage, bengaluru woman turns down marriage for dog, love for dogs, mans best friend,. dog stories

Bengaluru woman turned down a guy’s marriage proposal because he disliked her dog. The woman's bio on Facebook reads "For my dog, I am the only one. And that's all that matters."

కాబోయే నూతన జంట మధ్య పేచీ పెట్టిన శునకం

Posted: 09/14/2016 07:54 PM IST
Woman turned down marriage proposal because of dog

పెద్దలు కుదర్చిన వివాహామది. వారిద్దరూ ఒకరికోకరు నచ్చారు కూడా. అయినా వారిద్దరి మధ్య ఓ విశ్వాస జంతవు అగాధాన్ని నింపింది. నిండు నూరే్ళ్లు కలసి జీవించాలని కలలు కంటున్న జంటను క్షణాల్లో విడదీసింది. ఇంతకీ ఏం జరిగింది అనేగా.. తను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్కను వద్దన్నాడని ఓ యువతి తన పెళ్లిని రద్దు చేసుకుంది. తన కుక్కకు తానొక్కదాన్నే తోడని, దానికి దూరం చేయాలని చూసే ఏది తనకు వద్దని తెగేసి చెప్పి మూగజీవాలపై తనకు ఉన్న అప్యాయతను చాటుకుంది. ప్రస్తుతం ఈ విషయం ఇంటర్నెట్ లో వైరల్ అయింది.

బెంగళూరుకు చెందిన కరిష్మా వాలియా అనే యువతి గుర్గావ్ లోని డిలైట్ ఇండియా సంస్థలో పనిచేస్తోంది. ఆమెకు ఇటీవల పెళ్లి సంబంధం వచ్చింది. అబ్బాయి కూడా మంచి అందగాడే. మంచి హోదాలోనే ఉన్నాడు. తల్లి దండ్రుల బలవంతంలో పెళ్లికి తొలుత ఒప్పుకుంది. అలా వారిద్దరి మధ్య పెళ్లికి ముందు వాట్సాప్ సంభాషణలో కుక్కల విషయం చర్చకు వచ్చింది. కరిష్మాకు కుక్కలంటే ఎంత ఇష్టమో అతడికి అంత కష్టం. అబ్బాయి కుటుంబానికి కూడా కుక్కలంటే ఇష్టం ఉండదట. అదే విషయాన్ని ఆమెతో చెప్పాడు.

దీంతో ఆమె ఒక్క సెకను కూడా ఆలోచించకుండా తనకు అతడితో సెట్టవదని, పెళ్లి చేసుకోవడం కుదరదని తెగేసి చెప్పింది. దీంతో అవాక్కయినా అబ్బాయి నువ్వు నిజంగా సీరియస్ గానే చెప్తున్నావా అని ప్రశ్నించాడు. అయినప్పటికీ ఆమె తెగేసి చెప్పడంతో చిర్రెత్తిపోయిన ఆ కుర్రాడు 'ఇలా అంటున్నందుకు క్షమించు.. అలాంటప్పుడు ఆ కుక్కను పెళ్లి చేసుకో' అని  మరో మెస్సేజ్ పెట్టాడు. అలా వారిద్దరి మధ్య మొదలవ్వాల్సిన వివాహ బంధం ఆదిలోనే ఆగిపోయింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delloite india  dog  best friend  Bengaluru woman  marriage  would be hurted  

Other Articles