ఆ పెద్దావిడ స్కర్ట్ నుంచి వస్తువులు బయటపడుతూనే ఉన్నాయి | Mexican grandma hiding boxes of chewing gum down her skirt

Mexican grandma hiding boxes of chewing gum down her skirt

Mexican shoplifting grandma, Mexican woman hiding boxes, woman shopping mall under skirt, woman skirt hide boxes, woman hiding boxes under skirt, woman thief caught in shopping mall

Mexican shoplifting grandma stuffs 7 boxes of chewing gum down her skirt

ITEMVIDEOS:లంగాలో చేయి దూర్చి బయటికి తీస్తూనే ఉంది...

Posted: 09/09/2016 12:04 PM IST
Mexican grandma hiding boxes of chewing gum down her skirt

ఈ వీడియో చూసిన వారికి ఇది నమ్మాలంటే కాస్త ఆశ్చర్యకరంగా, కాస్త ఆసక్తిగా అనిపించడం ఖాయం. ఓ మహిళ తాను వేసుకున్న స్కర్ట్ లో చేయి పెట్టి వస్తువులను బయటికి తీస్తుంటే అదేమన్నా అక్షయ పాత్రనా? అన్న అనుమానాలు రాక మానదు.  ఒకదాని తర్వాత మరోకటి తీస్తుంటే నోళ్లు వెళ్లబెట్టడం అక్కడున్న వారి వంతు అయ్యింది. అసలు ఆమె స్కర్ట్ వెనకాల అంతలా ఏముంది అంటారా?

మెక్సికోకు చెందిన ఓ ముసలావిడ ఓ షాపింగ్ మాల్ లోకి వెళ్లింది. అక్కడ తన చోరచతురతను ప్రదర్శించి ఓ ఏడు చూయింగమ్ డబ్బాలను తాను వేసుకున్న స్కర్ట్ లో దాచింది. సీసీ కెమెరాల ద్వారా విషయాన్ని పసిగట్టిన షాప్ యజమాని ఆమెను అడ్డగించాడు. క్యాష్ కౌంటర్ దగ్గరికి లాక్కెల్లి మర్యాదగా లోపల ఏం దాచావో బయటికి తీయ్యమని, లేకపోతే పోలీసులకు పట్టిస్తానని బెదిరించాడు. అంతే...

ఆ పెద్దావిడ తన లంగాలోకి చేయి దూర్చి ఒక్కోక్కటిగా బయటికి తీస్తూనే ఉంది. ఆ వీడియో ప్రస్తుతం నెట్లో లో హల్ చల్ చేస్తోంది. అయితే ఆవిడ వేసుకున్న దుస్తులకు, అందులో వాటిని దాచటం కష్టమని పలువురు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. మొత్తానికి ఏమైతేనేం వస్తువులు రికవరీ కావటంతో ఆవిడగారిని పోలీసులకు అప్పజెప్పకుండా వదిలిపెట్టేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mexican woman  shoplifting  chewing gum  boxes  caught  

Other Articles