Delhi's ex-women's minister arrested on rape charge

Sandeep kumar arrested after woman in video tape alleges rape

sandeep kumar, sandeep kumar arrested, aap mla arrested, aap mla sacked, sandeep kumar rape charge, sex tape, sex scandal, aap mla sex tape, sandeep kumar sex tape, sandeep kumar rape

FORMER Delhi minister Sandeep Kumar was arrested on Saturday night, hours after a woman alleged that he had drugged and raped her a year ago

అప్ బహిష్కృత ఎమ్మెల్యేకు ఒక రోజు పోలీసు కస్టడీ

Posted: 09/04/2016 06:00 PM IST
Sandeep kumar arrested after woman in video tape alleges rape

ఢిల్లీకి చెందిన మాజీ అమాత్యుడు తనను బలవంతంగా లోబర్చుకుని తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని వీడియో టేప్ లోని మహిళ పిర్యాదు చేయడంతో అప్ బహిష్కృత నేత సందీప్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. నీలి సిడీలు, మహిళలను లోబర్చుకున్నారన్న ఆరోపణలతో కష్టాల్లో ఇరుక్కున్న ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత సందీప్ కుమార్ను కోర్టు ఒక రోజు పోలీసుల కస్టడీకి పంపించింది. సందీప్ను అరెస్టు చేసిన పోలీసులు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలోని రోహిణిలోగల మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఒకరోజు తమకు రిమాండ్కు ఇవ్వాల్సిందిగా కోర్టు అనుమతి కోరారు.

ఇందుకు కోర్టు ఓకే చెప్పడంతో ఆయనను మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. రేషన్ కార్డు కోసం ఇంటికి వెళ్లిన మంత్రి తనకు మత్తుపానీయం ఇచ్చి స్పృహలో లేనప్పుడు లైంగికదాడికి ప్రయత్నించాడని, తనకు తెలియకుండా వీడియో తీశాడని ఉత్తర ఢిల్లీలోని సుల్తాన్ పురి పోలీస్ స్టేషన్లో ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా సందీప్ కుమార్ సహాయకుడిని పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు.

అభ్యంతరకర వీడియోలు లీక్ చేసి, సర్క్యులేట్ చేశాడన్న అభియోగంతో మాజీ మంత్రి, ఆప్ నుంచి ఉద్వాసనకు గురైన సందీప్ కుమార్ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ సచివాలయం నుంచి ప్రవీణ్ కుమార్ ను పోలీసులు కొద్ది సేపటి కిందట అరెస్టు చేసి తీసుకువెళ్లారు. బహిష్కృత ఆప్ నేత సందీప్ కుమార్ అభ్యంతర కరంగా మహిళలతో కలిసి ఉన్న వీడియోను లీక్ చేశాడన్న అభియోగంలో ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sacked AAP minister  Sandeep Kumar  rape case  sex cd  delhi court  police custody  

Other Articles