Don't Do It Again, Says President As PM Uses Special Powers For Ordinance

Don t bypass the cabinet president to govt on ordinance sent to him

President,Pranab Mukherjee,President Pranab,President Pranab Mukherjee,President upset,Enemy Property Act,modi government ordinance, president note to modi government, bypass cabinet, PM narendra modi, modi government, national news

President Mukherjee, in his note, told the Modi government that he was signing the ordinance in the interest of public good, but warned that the cabinet must not be bypassed ever again.

మోడీ సర్కార్ కు రాష్ట్రపతి జలక్.. అర్ఢినెస్ప్ లపై ప్రణబ్ నోట్..

Posted: 08/31/2016 12:46 PM IST
Don t bypass the cabinet president to govt on ordinance sent to him

కేంద్రంలో బీజేపి నేతృత్వంలోని నరేంద్రమోడీ సర్కార్ కొలువుదీరిన సుమారు రెండున్నరేళ్లకు ఎన్డీయే ప్రభుత్వానికి పెద్ద జలక్ తగిలింది. నరేంద్రమోడీ సర్కార్కు తొలిసారిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జలక్ ఇచ్చారు. పార్లమెంటు ద్వారా కాకుండా రాష్ట్రపతి ప్రత్యేక అధికారాలను వినియోగింది.. అర్డినెన్సుల పాలనను సాగించడంపై అయన అక్షేపించారు. ఇప్పటికే పలు దఫాలుగా అర్డినెన్సులపై సంతకాలు చేసిన రాష్ట్రపతి ప్రణబ్.. తాజాగా కేంద్ర ప్రభుత్వం పంపిన మరో అర్డినెన్స్ పై సంతకాన్ని చేసి. దానితో పాటుగా ఒక నోట్ ను కూడా పంపారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటులో బిల్లలను అమోదం చేసుకుని వాటిని వినియోగంలోకి తీసుకురావాలని అయన పేర్కోన్నారు. దానికి బదులు పార్లమెంటులో అమోదం పొందని బిల్లులను ఇలా అర్డినెన్సుల రూపంతో తీసుకురావడాన్ని అయన ఆక్షేపించారు. ఎన్డీయే సర్కారు ఒత్తిడితో ఇప్పటికే నాలుగుసార్లు ఆర్డినెన్స్ లపై సంతకాలు పెట్టిన ఆయన, మరోసారి ఇలా చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీకి నోట్ రాసి పంపినట్టు తెలుస్తోంది. ప్రజా ప్రయోజనాల కోసం కొన్నిసార్లు ఆర్డినెన్స్ లు తేవడం మంచిదే అయినప్పటికీ, ప్రతీసారి ఇలా చేయడం సహేతుకం కాదని చెప్పినట్లు సమాచారం.

తాజా ఆర్డినెన్స్ లో 48 సంవత్సరాల నాటి ఎనిమీ ప్రాపర్టీ చట్టానికి సవరణలు చేస్తూ, రూల్ 12ను వాడుకుంటూ, క్యాబినెట్ ఆమోదం లేకుండానే ఆర్డినెన్స్ పై సంతకం కోసం రాష్ట్రపతి వద్దకు దాన్ని పంపారు ప్రధాని. యుద్ధాల తరువాత పాకిస్థాన్ లేదా చైనాకు వలస వెళ్లిన వారి ఆస్తులకు సంబంధించిన నిబంధనలను ఈ ఆర్డినెన్స్ సవరిస్తోంది. ఈ సంవత్సరం ఆరంభంలో లోక్ సభలో పాసైన చట్ట సవరణ బిల్లు, రాజ్యసభలో మాత్రం ఆగిపోయింది. దీన్ని ఆర్డినెన్స్ గా తీసుకువచ్చి అమలు చేయాలని మోదీ సర్కారు గతంలోనే నిర్ణయించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : President  Pranab Mukherjee  modi gorernment  note  ordinance  bypass cabinet  

Other Articles