Salman Khan’s sister robbed of cash, valuables worth Rs 3.25 lakh

Theft at salman s sister arpita s home cash goods worth rs 3 25 lakh stolen

salman khan, arpita khan sharma, salman khan sisters, arpita khan robbed, arpita khan house robbed, arpita khan bandra house theft, arpita khan sharma house robbed, mumbai news

Arpita Khan-Sharma and her husband, Aayush Sharma, were reportedly traveling abroad when the robbery took place

ప్రముఖ నటుడి సోదరి ఇంట్లో చోరి..

Posted: 08/24/2016 05:49 AM IST
Theft at salman s sister arpita s home cash goods worth rs 3 25 lakh stolen

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ ఇంట్లో దొంగతనం జరిగింది. అర్పితాఖాన్, ఆమె భర్త ఆయూష్ శర్మ నివసిస్తున్న బాంద్రాలోని పసిఫిక్ హైట్స్ అపార్ట్ మెంట్ లో దొంగలు పడ్డారు. రూ. 3.5 లక్షలు విలువచేసే నగదు, బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. విహారయాత్ర నుంచి ఆదివారం తిరిగివచ్చిన అర్పితాఖాన్ దంపతులు ఇంట్లో దొంగలు పడిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అర్పితాఖాన్ ఇంట్లో పనిచేసే ఆఫ్సా అనే పనిమనిషి మీదనే తమకు అనుమానం ఉందని అర్పిత పిర్యాదులో పేర్కోందని తెలిపారు. అమె గత నెల 30వతేదీనుంచి ఆమె కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. గత ఆదివారం కన్నా ముందే అర్పితాఖాన్ ఇంట్లో దొంగతనం జరిగి ఉంటుందని ఖర్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ రామచంద్ర జాదవ్ చెప్పారు. రూ. 2.25 లక్షలు, 10 గ్రాముల గోల్డ్ చెయిన్, డిజైనర్ దుస్తులను దొంగలు ఎత్తుకెళ్లారని తెలిపారు. కాగా అర్పిత పిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అమె డ్రైవర్ తో పాటు అపార్టుమెంట్లలోని మిగతా పనిమనుషులను విచారించి అఫ్సా ఖాన్ వివరాలను సేకరించారు.

అనంతరం నలసోపారాలో నివసించే ఆమెను అరెస్టు చేసిన పోలీసులు అర్పిత నివాసానికి తీసుకోచ్చి విచారించారించినట్లు సమాచారం. అర్పిత ఇంతో గత ఏడాదిన్నర కాలంగా అమె పనిమనిషిగా పని చేస్తుందని, తెలిపారు. అయితే అమె పేరును ఎఫ్ఐఆర్ లో నమోదు చేయని పోలీసులు ఇదంతా కేవలం ప్రాథమిక విచారణ అని, దర్యాప్తు పూర్తైన తరువాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Arpita  Mumbai  Bandra  Nalasopara  Domestic help  Bollywood  

Other Articles