సింధు కోచ్ పుల్లెల గోపీచంద్ పై టీ మంత్రి షాకింగ్ కామెంట్లు | Telangana Deputy CM Mohammad Mahmood Ali comments on Pullela Gopichand

Pv sindhu coach pullela gopichand insulted by telangana minister

Telengana Deputy Chief Minister, Mohammad Mahmood Ali in a bizzare comment has said that PV Sindhu need an additional coach embarrassing everyone.Pullela Gopichand is good, but we will find a better coach for PV Sindhu.

Telengana Deputy Chief Minister, Mohammad Mahmood Ali in a bizzare comment has said that PV Sindhu need an additional coach embarrassing everyone.Pullela Gopichand is good, but we will find a better coach for PV Sindhu.

ITEMVIDEOS: పుల్లెల గోపీచంద్ పై టీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Posted: 08/22/2016 04:59 PM IST
Pv sindhu coach pullela gopichand insulted by telangana minister

ప్రశంసలు ఉన్నచోటే విమర్శలు పుట్టుక రావటం కామన్ గా మారిపోయింది. రియో ఒలంపిక్స్ రజత పతకం సాధించి వచ్చిన పీవీ సింధు వ్యవహారంలో కూడా ఇవి జరుగుతున్నాయి. సోమవారం మధ్యహ్నాం గచ్చిబౌలి స్టేడియంలో ఆమెకు తెలంగాణ ప్రభుత్వం ఘన సన్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి.
 
పీవీ సింధు విజయంలో కీలకపాత్ర పోషించిన గురువు పుల్లెల గోపీచంద్ ను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. సన్మాన కార్యక్రమంలో అలీ మాట్లాడుతూ...  వచ్చే ఒలింపిక్స్‌లో సింధు గోల్డ్‌మెడల్‌ సాధించేందుకు గోపిచంద్‌ కంటే ఇంకా మంచి వ్యక్తితో కోచింగ్‌ ఇప్పిస్తామని పేర్కొన్నారు. ఇంతలో తిరిగి గొంతు సవరించుకుని... ఇప్పుడున్న కోచ్ మంచివాడేనని పేర్కొంటూ అవసరమైతే ఇంకా మెరుగైన కోచింగ్ ఆమెకు అందించేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపాడు. ఆపై గోపీచంద్ అకాడమీ కోసం భూమి కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కవర్ చేసే యత్నం చేశాడు.

ఏదేమైనా నోరు జారి అయిన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతోంది. తన గెలుపు వెనుక అసలు కృషి గోపీచందేనని సింధుతోపాటు, ఆమె తల్లిదండ్రులు పేర్కొన్న సంగతి తెలిసిందే. అభినంద సభలో ప్రభుత్వ గొప్పతనం చాటేందుకు, గోపీచంద్ ను అవమానించేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  deputy CM  Mahmood Ali  PV Sindhu  Pullela Gopichand  comments  

Other Articles