Shobha De Hails 'Hero' PV Sindhu's Olympic Feat

Shobha de hails hero pv sindhu s olympic feat

Olympics 2016, India, Badminton, Rio 2016 Badminton, PV Sindhu, shobhaa de, sindhu enters final, Badminton Finals, Badminton, Carolina Marin, Narendra Modi, Pranab Mukherjee, Rio De Janeiro,

Author Shobhaa De, who has been drawing flak for her unwarranted comments on the Indian contingent at the Rio Olympics, described shuttler PV Sindhu as "24 carat gold" and called her a "hero" after she clinched a silver medal at the event

తప్పుదిద్దుకుంది.. బంగారమే అని కితాబిచ్చింది..

Posted: 08/21/2016 10:16 AM IST
Shobha de hails hero pv sindhu s olympic feat

రియో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్స్ లో పోరాడి ఓడిన పీవీ సింధు.. చరిత్రను సృష్టించి రజత పతకం సాధించడంతో అమెకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్న తరుణంలో ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్ శోభా డే కూడా తన తప్పును దిద్దుకున్నారు. రజత పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు పై అమె చేసిన అనుచిత వ్యాఖ్యలను దిద్దుకున్నారు. వెండి పథకాన్ని సాధించిన  సింధు 24 కారెట్ల బంగారమని, ఆమె  హీరో అని పొగడ్తల వర్షం కురిపించారు. ధైర్యశాలి సింధు నిజమైన హీరో అని వ్యాఖ్యానించారు. 24 క్యారెట్ల బంగారమా, మేము నిన్ను ప్రేమిస్తున్నాము అని ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

పీవీ సింధు, దీపా కర్మాంకర్,  సాక్షి మలిక్ విజయ గాథలను పోస్ట్ చేశారు. సింధు జీవితంపై సినిమా తీయాలని, ఇందులో దీపికా పదుకోన్ లీడ్ రోల్ లో  నటించాలని అన్నారు. దీపిక కన్నా బాగా ఇంకెవరు నటిస్తారని సరదాగా వ్యాఖ్యానించారు.భారత క్రీడాకారులను పతకాలు రావని వారు కేవలం సెల్ఫీలు తీసుకోవడానికే రియోకు వెళ్లారని, వారిపై చేసే ఖర్చంతా వృధా  అని గంతంలో శోభా ట్వీట్ చేశారు. దీనిపై  వివిధ రంగాల ప్రముఖుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Olympics 2016  India  Badminton  Rio 2016 Badminton  PV Sindhu  shobhaa de  Carolina Marin  

Other Articles