టీచర్ పోస్టుల దరఖాస్తుల్లో గాంధీ, అమితాబ్ బచ్చన్ పేర్లు | Gandhi and Bachchan apply for jobs in UP schools

Gandhi and bachchan apply for jobs in up schools

Mahatma Gandhi to Amitabh Bachchan applications, Gandhi and Big B as assistant teachers, UP school teacher application forms, Gandhi and Bachchan apply, Gandhi and Bachchan application forms

From Mahatma Gandhi to Amitabh Bachchan, it's a long list of applicants hoping to get jobs as assistant teachers in Lucknow's government schools. Mahatma Gandhi, in fact, is the merit list topper with 94% marks.

బడి పంతుల పోస్టుల కోసం బాపూ, బచ్చన్ లు

Posted: 08/19/2016 01:50 PM IST
Gandhi and bachchan apply for jobs in up schools

అధికారుల నిర్లక్ష్యం, ఆకతాయిల చేష్టల ఫలితం ఎలా ఉంటుందో మరోసారి నిరూపితమైంది. అసిస్టెంట్ టీచర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో మహాత్మాగాంధీ, అమితాబ్ బచ్చన్ సహా పలువురు ప్రముఖులు ఉండటమే కాదు, మెరిట్ లిస్ట్ లో కూడా వారి పేర్లే ఉండటం గమనార్హం. యూపీ ప్రభుత్వం ఇటీవల 16,448 అసిస్టెంట్ టీచర్ పోస్టుల కోసం బేసిక్ టీచింగ్ సర్టిఫికెట్ ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఉద్యోగార్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. లక్నోలో 33 పోస్టులు ఉంటే ఏకంగా 800 మంది దరఖాస్తు చేసుకున్నారు.

మెరిట్ జాబితా తయారుచేస్తున్న అధికారులు మహాత్మాగాంధీ, అమితాబ్ బచ్చన్ సహా పలువురు ప్రముఖుల పేర్లతో ఉన్న 15 దరఖాస్తులు చూసి అవాక్కయ్యారు. ఇంకా దారుణం ఏంటంటే.. గాంధీ 94 శాతం మార్కులతో మెరిట్‌ జాబితాలో టాప్‌లో ఉండడం! మొదట ఆశ్చర్యపోయిన వారు బాగా ఆలోచించి మెరిట్ లిస్ట్‌లో ఆయా దరఖాస్తులను కూడా చేర్చాలని నిర్ణయించారు. వారు రూపొందించిన మెరిట్ జాబితాలో 94 శాతం మార్కులతో గాంధీకి తొలి స్థానం దక్కింది.

అయితే రెండో ర్యాంకర్ అయిన అర్షాద్ ఇంటిపేరు రాయాల్సిన చోట నిర్లక్ష్యంగా రాయడం, చాలామంది ఇంటిపేర్లను ప్రస్తావించకపోవడంతో అవన్నీ నకిలీ అప్లికేషన్లని తర్వాత అధికారులు ధ్రువీకరించారు. ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని అవకాశంగా తీసుకుని అధికారుల్లో అయోమయం సృష్టించేందుకే అభ్యర్థులు ఇలా చేసి ఉంటారని విద్యాశాఖాధికారి ప్రవీణ్ మణి త్రిపాఠి తెలిపారు. ఈ విషయమై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆయన ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP  Gandhi  Amithabh Bachchan  teacher jobs  

Other Articles