హోదాపై జాతీయ మీడియాతో చంద్రబాబు | Chandrababu Naidu on special status with national media

Chandrababu naidu on special status with national media

AP CM Chandrababu Naidu on special status, Chandrababu special status with national media, Chandrababu with National media, fight until get special status

AP CM Chandrababu Naidu on special status with national media, says fight will not end till get special status.

హోదాపై బాబుకు ఏం క్లారిటీ ఉందసలు?

Posted: 08/17/2016 10:05 AM IST
Chandrababu naidu on special status with national media

ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన లేకపోయినా, మిత్రపక్షం తెలుగుదేశం మాత్రం ఇంకా కూల్ గానే సంప్రదింపులు జరుపుతోంది. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ, మరో 11 రాష్ట్రాలు ఒత్తిడి తెస్తాయన్న భయంతోనే వెనకంజ వేస్తోంది. ఈ నేపథ్యంలో రకరకాల స్టేట్ మెంట్లతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. అయితే తాను మాత్రం ఈ విషయంలో స్పష్టమైన విజన్ తోనే పోరాడుతున్నానని అంటున్నాడు ఏపీ సీఎం చంద్రబాబు.

కేంద్రం ఎంతమేర కాలయాపన చేసినా... తన వైఖరిలో మాత్రం మార్పు రాదని, హోదా కోసం పోరాటంలో వెనకడుగు వేసేది లేదని చంద్రబాబు తేల్చేశాడు. పుష్కరాల కవరేజీ కోసం జాతీయ మీడియాకు చెందిన పలువురు ప్రతినిధులు మంగళవారం విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా అంశం ప్రస్తావనకు రాగా, వారితో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇప్పటికే చాలాసార్లు ఢిల్లీ వెళ్లానని చెప్పిన చంద్రబాబు, ప్రధాని సహా పలువురు మంత్రుల వద్ద తన వాదన వినిపించానని చెప్పుకొచ్చాడు. ప్రత్యేక హోదా ప్రకటించేదాకా ఢిల్లీ వెళుతూనే ఉంటానని, కేంద్రాన్ని అడుగుతూనే ఉంటానని, ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని వ్యాఖ్యానించాడు. అయినా ఏపీ ప్రజల అభీష్టానికి భిన్నంగా రాష్ట్రాన్ని విభజించిన కేంద్రానికి, ఆ రాష్ట్ర ప్రజలను సంతృప్తిపరచాల్సిన అవసరం లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. 'ప్రత్యేక హోదాపై ఏపీ ప్రజల మనోభావాలను ఢిల్లీలోని కేంద్రం పెద్దలకు అర్థమయ్యేలా చూడండి' అంటూ ఆయన ఢిల్లీ మీడియాను కోరాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో చాలా భవిష్యత్తులో చాలా అవసరం ఉంటుదని చెప్పిన తెగదెంపులు ఉండవనే నర్మగర్భంగా చెప్పేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Special Status  National Media  Central  

Other Articles