ఒమన్ చిరు అభిమానుల అండతో తెలంగాణ కూలీలకు విముక్తి | Chiru Oman fans help to Gulf workers to return India

Chiru oman fans help to telangana labours to return india

Megastar Chiranjeevi Oman fans, telangana Gulf workers, Mega Fans help to Gulf workers, Gulf Chiru fans, Oman C.Ramdass, Chiru Guls Fans

Megastar Chiranjeevi Oman fans help to Telangana laboures who cheated in Oman to return India.

గల్ఫ్ కూలీలకు బాసటగా మెగా అభిమానులు

Posted: 08/16/2016 06:50 PM IST
Chiru oman fans help to telangana labours to return india

పొట్టచేత పట్టుకుని గల్ఫ్‌బాట పట్టిన వలస కూలీల బతుకులు ఎడారులవుతున్నాయి. సౌదీలోని పేరుమోసిన కంపెనీలన్నీ మూతపడటం, దళారీలు మోసం చేస్తుండటంతో వేలాదిమంది భారతీయ కార్మికులు రోడ్డున పడుతున్నారు. దీనికి తోడు ఫ్రీగా పని చేయించుకుని కొన్ని కంపెనీలు వారిని రోడ్డుకీడుస్తున్నాయి. తాజాగా ఒమన్ లో 14 మంది తెలంగాణ కార్మికులకు ఇలాంటి పరిస్థితే ఎదురవ్వగా, మెగా అభిమానుల సాయంతో వారంతా బయటపడగలిగారు.

తెలంగాణకు చెందిన 14 మంది ఈ మధ్యే ఒమాన్‌‌లో భవన నిర్మాణ కార్మికులుగా పని చేయడానికి అక్కడికి వెళ్లారు. కరీంనగర్ కు చెందిన సత్యం అనే ఏజెంట్ ముంబాయిలోని వర్లీలో ఉంటూ కూలీలను గల్ఫ్ దేశాలకు పంపిస్తుంటాడు. ఈ క్రమంలోనే అదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ మరియు నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఈ 14 మందిని భారీగా డబ్బులు తీసుకుని 6 నెలల క్రితం ఒమన్ పంపించాడు. తీరా అక్కడికి వెళ్లాక వారికి సరైన సదుపాయాలు సమకూర్చలేదంట. దీంతో వారంతా కొండలపై జీవించాల్సి వచ్చింది. మొదట ఓ పాఠశాల భవన నిర్మాణంలో కొంతకాలం పని చేసిన వారికి కేవలం ఒక నెల జీతం మాత్రమే చెల్లించారంట. దీంతో వారు ఆర్థికంగా చాలా కష్టాలు ఎదుర్కున్నామని చెబుతున్నారు. చివరికి మోసపోయామని తెలుసుకున్న వారంతా మూకుమ్మడిగా అక్కడి నుంచి బయలుదేరారు. రెండు రోజుల కాలినడక, ఆపై ట్రక్కులో 150 కిలో మీటర్లు ప్రయాణించి ఎలాగోలా మస్కట్ లోని భారతీయ ఎంబసీ కార్యాలయానికి చేరుకోని తమ గోడును వెల్లదీసుకున్నారు.

వారి కష్టాలు తెలుసుకున్న సామాజిక కార్యకర్త, విజయనగరం జిల్లాకు చెందిన సి.రాందాస్ వీరందరికి బస కల్పించడమే కాకుండా, అక్కడి మెగా స్టార్ అభిమానులందరినీ పోగేసి విరాళాలు సేకరించి వారికి అందజేశారు. తమకు తలా 30 వేల ఆర్థిక సాయం అందించిన మెగా అభిమానులకు వారంతా కృతజ్నతలు చెబుతూ తిరిగి ఇండియాకు పయనమయ్యారు.

కాగా, దాదాపు పదివేల మంది భారతీయ కార్మికులు ఇప్పుడు గల్ఫ్ దేశాలలో ఇదే తరహా పరిస్థితి ఎదుర్కుంటుడగా, వారిలో సగం మంది తెలంగాణవారే ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ మరోచోట పనిచేయడానికి రోడ్డెక్కితే వర్క్ పర్మిట్లు లేవనే కారణంతో అరెస్టు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కార్మికులందరినీ క్షేమంగా రప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయటంతోపాటు, కార్మికుల సంక్షేమం, భద్రత కోసం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Oman  Mega Fans  help  Telangana  workers  

Other Articles