ఫ్లైట్ లో చెప్పుకోరాని చోట తాకిన వైజాగ్ వాసి | Vizag man improperly touched woman aboard flight

Indian man improperly touched woman aboard flight

Man improperly touched woman, Vizag man arrested for misbehaving with, Indian man improperly touched woman, Los Angeles to New Jersey flight, Veerabhadrarao Kunam arrested, Vishakapatnam man arrested for misbehave

Man improperly touched woman aboard flight. Man recognised as Veerabhadrarao Kunam from Vishakapatnam (India) is charged with abusive sexual contact.

ఫ్లైట్ లో అక్కడ చేతులు వేశాడు .. ఆపై ఏం ఆఫర్ చేశాడంటే....

Posted: 08/03/2016 10:17 AM IST
Indian man improperly touched woman aboard flight

అగ్రరాజ్యంలో తెలుగు వారి పరువు తీశాడు ఓ వ్యక్తి. విమానంలో ప్రయాణిస్తుండగా ఓ జంటతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించి జైలు పాలయ్యాడు. చెప్పుకోరాని చోటల్లా తాకడమే కాదు, ఆమెతో ఉన్న స్నేహితుడితో పిచ్చిగా వ్యవహారించాడు. గత నెల 30న లాస్ ఏంజెలిస్ నుంచి న్యూజెర్సీకి వెళుతున్న విమానంలో ఈ ఘటన జరిగింది.

వైజాగ్ కు చెందిన వీరభద్రరావు కూనం (58) గత శనివారం ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నాడు. పక్కనే ఓ జంట నిద్రిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన వీరభద్రరావు ఆమె మర్మాంగాలపై చేయి వేశాడు. అంతేకాదు కాలుతో కాలును తాకుతు చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. నిద్ర నుంచి మేలుకున్న ఆమె విషయాన్ని తన సహచరుడికి చెప్పింది. దీంతో ఆ వ్యక్తి వీరభద్రరావుతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో విషయాన్ని లైట్ తీసుకోమని, కావాలంటే లిక్కర్ కొనిస్తానని దరిద్రపు గొట్టు ఆఫర్ చేశారు. చిర్రెత్తుకొచ్చిన ఆ జంట వెంటనే అధికారులకు ఫిర్యాదు చేసింది.

దీంతో రంగ ప్రవేశం చేసిన ఎఫ్ బీఐ అతన్ని అరెస్ట్ చేసింది. ముదిమి వయసులో అసభ్య చేష్టలకు పాల్పడ్డ వీరభద్రం ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నాడు. సోమవారం అతన్ని నెవార్క్ ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో 50 వేల డాలర్లు (రూ.33 లక్షలు) సెక్యూరిటీ బాండ్ ను సమర్పించిన వీరభద్రరావు బెయిల్ పై విడుదలయ్యారు. వీరభద్రరావుపై నమోదైన అభియోగాలు రుజువైతే... ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష, రూ.1.66 కోట్ల మేర జరిమానా పడే అవకాశాలున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vizag man  Veerabhadrarao Kunam  arrest  flight  misbehave  woman  touch  

Other Articles