టెర్రరిజంకు నేనూ వ్యతిరేకమే! | Zakir Naik address media about allegations

Zakir naik address media about allegations

Zakir Naik secret press meet, Zakir Naik on allegations, Zakir Naik on bangla Attack

Zakir Naik address media about allegations in secret press meet.

ITEMVIDEOS:టెర్రరిజంకు నేనూ వ్యతిరేకమే!

Posted: 07/15/2016 12:24 PM IST
Zakir naik address media about allegations

ఇస్లాం మత ఉపన్యాసకుడు జకీర్ నాయక్ తనపై వస్తున్న ఆరోపణలకు ఎట్టకేలకు స్పందించాడు. రహస్య ప్రదేశం నుంచి కాసేపటి క్రితం స్కైప్ ద్వారా మాట్లాడిన జకీర్ తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించాడు. బంగ్లా దాడులను నేనే బాధ్యుడిని అనటం సరికాదంటు మొదలుపెట్టిన ఆయన ఉగ్రవాదానికి తానెప్పుడు వ్యతిరేకమనే ప్రకటించాడు. నేనెప్పుడూ శాంతినే కోరుకున్నా. తీవ్రవాద దాడులను ఖండిస్తున్నా అని ఆవేశ పూరిత స్వరంతో ఆయన చెప్పుకోచ్చాడు.

మత ఉగ్రవాదానికి ఇస్లాం ఎప్పుడు వ్యతిరేకమే. నా ప్రసంగాలను కొందరు వ్యతిరేకిస్తున్నారు. నా టీవీ ఛానెల్ ను ఎందుకు నిషేదించారో సమాధానం చెప్చాలని ఆయన డిమాండ్ చేశారు. అమాయకులను బలి తీసుకోవటం మంచిది కాదని, దీనికి అల్లా కూడా క్షమించడంటూ పేర్కొన్నాడు.

కాగా, బంగ్లా దాడులకు ముంబైకి చెందిన జకీర్ ఉపన్యాసాలే ప్రేరణ అని పట్టుబడ్డ ఉగ్రవాదులు చెప్పటంతో ఆయన పీస్ చానెల్ ను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రసంగాలను పరిశీలించిన మహారాష్ట్ర అధికారులు క్లీన్ చీట్ ఇచ్చినప్పటికీ భారత్ లో అడుగుపెట్టేందుకు ఆయన జంకుతున్నారు. ఆయన భారత్ వచ్చినా అరెస్ట్ చేయబోమని కేంద్ర హోం శాఖ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zakir Naik  press meet  Bangladesh attack  Peace channel  

Other Articles