passengers negitive propaganda against indigo airlines

Indigo offloads 25 fliers from hyderabad bound flight

passengers agitatation indigo, indigo passengers agitation, negitive propoaganda indigo, indigo negitive propaganda, indigo airlines, indigo offloads, 25 indigo fliers, hyderabad bound flight

passengers agitate and gives negitive propoaganda agianst indigo airlines as it offloads 25 fliers from hyderabad bound flight

ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై నెటిగివ్ ప్రచారం

Posted: 07/09/2016 06:48 PM IST
Indigo offloads 25 fliers from hyderabad bound flight

ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణం చేస్తున్నారా..? అయితే కాస్త జాగ్రత్త. బోర్డింగ్ సమయానికి కన్నా ముందుగానే విమానాశ్రయానికి చేరుకుంటున్నారా.? అయినా సరే జాగ్రత్తా అంటున్నారు ఈ విమాన ప్రయాణికులు. వీళ్లు ఎవరు..? అంటారా..? ఎందుకిలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు..? అంటారా..? వీళ్లు ఇండిగో విమానయాన బాధితులు. వీళ్లంతా బోర్డింగ్ చేసుకున్న ప్రయాణికులు.. అయినా వారికి ప్రయాణించే అవకాశం కల్పించకుండానే టేకాఫ్ అయి వెళ్లిపోయిందని వారు ఆరోపిస్తున్నారు. గతంలో ఇదే ఎయిర్‌లైన్స్ విమానాల్లో ఇలాంటి సంఘటనలే చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా గురువారం అర్ధరాత్రి, శుక్రవారం కూడా బోర్డింగ్ పూర్తి చేసుకున్న ప్రయాణికులు విమానంలోకి ఎక్కకుండానే టేకాఫ్ తీసుకున్న సంఘటనలు జరిగాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వయా బెంగళూరు మీదుగా ఢిల్లీ వెళ్లాల్సిన 6 ఈ 511 విమానంలో బోర్డింగ్ పూర్తి చేసుకున్న 25 మంది ప్రయాణికులు వెళ్లాల్సి ఉన్నా వారు ఎక్కకుండానే విమానం సమయానికి టేకాఫ్ తీసుకుంది. దీంతో ప్రయాణికులు రాత్రి ఒంటిగంట వరకు ఎయిర్‌పోర్ట్‌లో పడిగాపులు కాచారు. తాము సమయానికి బోర్డింగ్ పూర్తి చేసుకున్నా విమానంలోకి ఎక్కకుండా గేట్ మూసివేశారని ఆరోపించారు.

ఎయిర్‌లైన్స్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. శుక్రవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరిన విమానంలో కూడా సుమారు 20 మంది ప్రయాణికులు బోర్డింగ్ పూర్తి చేసుకున్న తర్వాత విమానంలోకి ఎక్కకుండానే టేకాఫ్ తీసుకుందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, గత ఏప్రిల్‌లో శబరిమలై వెళ్లే పలువురు ప్రయాణికులు కూడా సుమారు రెండు రోజుల పాటు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indigo airlines  shamshabad airport  boarding  

Other Articles