ప్రేమించానని గొంతు కోశాడు | girl brutally murdered by Lover in bhainsa

Girl brutally murdered by lover in bhainsa

Girl brutally killed in bhainsa, Mahesh killed sandhya, Sandhya killed by mahesh, Adilabad bhainsa news

Girl brutally murdered by lover in bhainsa. Mahesh cut sandhya throat in Adilabad.

ITEMVIDEOS:ప్రేమించానని గొంతు కోశాడు

Posted: 07/02/2016 05:29 PM IST
Girl brutally murdered by lover in bhainsa

మరో ప్రేమోన్మాది దాడికి యువతి నిండు జీవితం బలైంది. ఆదిలాబాద్ జిల్లా భైంసాలోని గోపాల్‌న‌గ‌ర్‌లో శనివారం మధ్యాహ్నం దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి నిరాక‌రించింద‌న్న కోపంతో ఓ యువ‌తిని మ‌హేశ్ అనే యువ‌కుడు దారుణంగా చంపేశాడు.

సంద్య (15) అనే యువ‌తి తన ఇంటికి సమీపంలోని ఓ షాపుకి వెళుతోన్న స‌మ‌యంలో మ‌హేశ్ ఆ యువ‌తి గొంతు కోసి హ‌త్య చేశాడు. జనాలు గుమిగూడటంతో నుంచి పారిపోయాడు. మృతురాలి పేరు సంధ్య అని స‌మాచారం. అంద‌రూ చూస్తుండ‌గా న‌డిరోడ్డుపై హ‌త్య జ‌ర‌గ‌డం స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. సంధ్య పొరుగింట్లోనే మ‌హేశ్ నివాసం ఉంటున్నాడని, ఆరు నెలల నుంచి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని బంధవులు చెబుతున్నారు. అయితే ఇంత కాలం నుంచి వేధిస్తున్నప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. కొందరు స్థానికులు మాత్రం గత కొంత కాలంగా ఆ ఇద్దరు సన్నిహితంగా ఉండటం చూశామని చెబుతుండటం విశేషం.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Adilabad  Bhainsa  Mahesh  sandhya  

Other Articles

Today on Telugu Wishesh