నడిరోడ్డుపై బిచ్చగాడి ప్యాంటు లాగి... | Passerby dragged off beggar trousers to reveal his hidden limbs

Passerby dragged off beggar trousers to reveal his hidden limbs

beggar trousers dragged, China Beggar cheated, hidden limbs China beggar

Passerby dragged off beggar trousers to reveal his hidden limbs in China.

ITEMVIDEOS:నడిరోడ్డుపై బిచ్చగాడి ప్యాంటు లాగి...

Posted: 07/02/2016 10:06 AM IST
Passerby dragged off beggar trousers to reveal his hidden limbs

ఒక మోసం వెనుక ఇద్దరు ఉంటారు. ఒకడు మోసపోయేవాడు, మరోకడు మోసం చేసేవాడు. కానీ, ఆ మోసాన్ని పసిగట్టే మూడోవాడు కూడా ఒకడు ఎక్కడో దగ్గర ఉంటాడు. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి చైనాలో బయటపడింది. కనిపించేవన్నీ నిజాలు కావని చెప్పటానికి తార్కాణమే ఈ అడుక్కునే వాడి వీడియో ఉదంతం.

ఓ బిచ్చగాడు చైనా రోడ్లలో తోపుడు బండ్ల మీద అడుకుంటున్నాడు. ఇంతలో ఓ వ్యక్తి అతడి దగ్గరికి వచ్చి అతని మీద పడిపోయాడు. నిర్ధాక్షిణ్యంగా అతని ఫ్యాంటును పట్టుకుని లాగటం ప్రారంభించాడు. అసలేం జరుగుతుందో అర్థం కానీ జనాలు అదంతా ఓ చోద్యంలా చూస్తూ ఉండిపోయారు. ఫ్యాంటు ఊడిపోయింది.. అతగాడి గుట్టు రట్టయ్యింది.

china beggar cheating

beggar pant dragged

నిజానికి అతడు అవిటివాడు కాదు. కాళ్లు రెండు పైకి మడిచి కట్టేసుకుని, ముష్టివాడిలా అవతారం ఎత్తాడు. కేవలం కష్టపడుకుండా కాసులు సంపాదించాలన్న కక్కుర్తితో ఇలా అవతారం ఎత్తాడు. అతన్ని మోసం పసిగట్టిన ఓ యువకుడు సాహసం చేసి అసలు విషయం బయటపెట్టాడు. అందుకే నిజం ఆపినా ఆగదు. అబద్ధాలు ఎంతో కాలం చెల్లవు... మోసాలతో జీవితాన్ని నడపలేం అన్నది మరోసారి నిరూపితమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  Beggar  cheating  hidden limbs  

Other Articles

Today on Telugu Wishesh