ఆర్టీసీ, కరెంట్ బాదుడుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ | KCR gives nod for Bus fare and Power tariff hike

Kcr gives nod for bus fare and power tariff hike

telagana CM, telangana RTC fare hike, Power tariff hike in telangana, KCR ok for hikes, తెలంగాణ ఆర్టీసీ ఛార్జీలు, కరెంట్ చార్జీలు తెలంగాణ, తెలంగాణ వార్తలు, తెలంగాణలో ఛార్జీల మోత, latest news, telangana news, KCR news, telangana news, telugu news

KCR gives nod for Bus fare and Power tariff hike. officials confirmed with low prices only.

ఆర్టీసీ, కరెంట్ బాదుడుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

Posted: 06/22/2016 04:46 PM IST
Kcr gives nod for bus fare and power tariff hike

తెలంగాణ‌లో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపున‌కు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఈమేరకు ఆయా అధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనపై సంబంధిత అధికారులు ఆయనకివివ‌రించగా, గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సామాన్య ప్రజలపై భారం పడకుండా చూడాలని ఈ సందర్భంగా కేసీఆర్ అధికారులతో చెప్పినట్లు సమాచారం.

గృహ అవ‌స‌రాల‌కు 100 యూనిట్ల‌లోపు వినియోగం ఉంటే విద్యుత్ ఛార్జీలు పెంచ‌వ‌ద్దని అధికారుల‌కు ఆయ‌న సూచించారంట. 100 యూనిట్లు దాటితే స్వల్పంగా ఛార్జీలు పెంచే ఆలోచనలో అధికారులు ఉన్నారు .ఇక ప‌రిశ్రమలు వినియోగించే విద్యుత్‌పై 7 శాతంలోపే పెంపు ఉండేలా చూడాలని చెప్పారంట. మరోవైపు ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రతిపాద‌న‌ను అధికారులు కేసీఆర్‌కి క్షుణ్ణంగా వివ‌రించారు.  ప‌ల్లెవెలుగు బ‌స్సుల్లో 30కిలోమీటర్ల లోపు రూపాయి ఛార్జీ పెంపున‌కు అంగీకరించారు. ఒకవేళ 30కిలోమీట‌ర్లు దాటితే రూ.2 పెంపు చేయ‌నున్నారు. ఇతర బ‌స్సు స‌ర్వీసుల్లో ఛార్జీల పెంపు 10శాతానికి మించ‌రాద‌ని సీఎం సూచించారంట.

ఆర్టీసీ, విద్యుత్ సంస్థలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయని, వాటిని అభివృద్ధి పరిచే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన కోరారు. అదేటైంలో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఛార్జీల పెంపుపై అధికారికంగా రేపు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telagana CM  KCR  TSRTC  Power tariff hike  

Other Articles