ఒలంపిక్స్ కోసం దారుణానికి ఒడిగట్టారు | Jaguar Is Shot Dead in Rio Olympic Torch Relay

Jaguar is shot dead in rio olympic torch relay

Jaguar shot dead, rio olympics torch relay, Cheetah killed for olympics, ఒలంపిక్స్ కోసం చిరుతను చంపారు, రియో టార్చ్ ఈవెంట్ లో చిరుత, మస్కట్ ను మట్టుపెట్టారు, తాజా వార్తలు, అంతర్జాతీయ వార్తలు, తెలుగు వార్తలు, international news, telugu news

Juma, a Jaguar grew in capitivity in a zoo and was used as an exhibit at the Olympic torch marchpast ceremony, at Manuas, in Brazil. It tried to escape after the ceremony, prompting the authorities to use traquilizer darts. As the darts proved ineffective and the animal threatened a vet, a soldier shot it down with bullets. Juma was a 17-year-old female that grew along with its siblings.

ITEMVIDEOS: ఒలంపిక్స్ కోసం దారుణానికి ఒడిగట్టారు

Posted: 06/22/2016 03:09 PM IST
Jaguar is shot dead in rio olympic torch relay

రియో 2016 ఒలింపిక్స్ వేడుకల నిర్వాహకులు దారుణానికి ఒడిగట్టారు. ఓవైపు సన్నాహకాలు జోరుగా ఊపందుకున్న వేళ అధికారులు చేసిన అతితో ఓ మూగజీవి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆటకు అదనపు ఆకర్షణ తేవడానికి ఓ చిరుతపులిని తెచ్చి దాన్ని కాల్చి చంపారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఒలింపిక్స్ పోటీలకు అధికారిక మస్కట్ గా పసుపు పచ్చ చిరుతను గుర్తించి, దానికి  'జింగా' అని పేరు పెట్టారు. టార్చ్ ఈవెంట్ జరుగుతున్న వేళ, జింగా కూడా ఉండాలన్న ఉద్దేశంతో మనౌస్ మిటలరీ కాంపౌండు పక్కనే ఉన్న జూ నుంచి జుమా అనే ఓ చిరుతపులిని తెచ్చారు. కార్యక్రమం వైభవంగా సాగుతున్న వేళ, సంరక్షకులు కాస్త నిర్లక్ష్యంగా ఉండటంతో జుమా తప్పించుకుంది. ఆ వెంటనే ఓ సైనికుడు దాన్ని కాల్చి చంపాడు. అయితే అధికారులు మాత్రం చిరుతకు ముందు మత్తు మందు ఇచ్చామని, అయినా అది లొంగకపోవటంతో కాల్చాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యం పూర్తి స్థాయిలో కనిపిస్తోందని, చిరుతను కాల్చినట్టుగా వారినీ కాల్చాలని జంతుప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులతో అతితో దేశం పరువు పోయిందని బ్రెజిల్ వాసులు మండిపడుతున్నారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cheetah killed  Jaguar shotdead  rio olympics  torch relay  telugu news  

Other Articles