క్లచ్ లేని బైక్ తో లాభాలు... ఎలాగంటే? | TVS Motor introduce a clutch less bike

Tvs motor introduce a clutch less bike

clutch less bike from TVS, TVS Motor launched clutch less bike in apache model, క్లచ్ లేని బైకులు, అపాచీ మోడళ్లలో క్లచ్ లేని బైక్ లు, తెలుగు వార్తలు, బిజినెస్ వార్తలు, క్లచ్ లేని బైకులు, తాజా వార్తలు, latest news, telugu news. new Semi-AMT Technology for motorcycles, TVS Motors bags patent for new Semi-AMT Technology

TVS Motor is the foremost company to introduce a clutch less bike in the domestic market.TVS Motors bags patent for new Semi-AMT Technology for motorcycles.

క్లచ్ లేని బైక్ తో లాభాలు... ఎలాగంటే?

Posted: 06/20/2016 05:07 PM IST
Tvs motor introduce a clutch less bike

ప్రముఖ మోటర్ బైక్ ల కంపెనీ టీవీఎస్ త్వరలో క్లచ్ లేని బైక్ లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనుంది. సెమీ ఆటోమేటెడ్ టెక్నాలజీతో రూపొందించనున్న ఈ విధానం ఏడేళ్ల క్రితమే రూపుదిద్దుకున్నప్పటికీ ఈ సంవత్సరం దానికి పేటెంట్ లభించింది. ఇక ఈ బైక్ లో క్లచ్ లేకుండా కేవలం హ్యాండిల్ దగ్గర ఓ మెకానిజం ఏర్పాటు చేస్తారు. దానిపై ఉండే స్విచ్ లతో గేర్లను మార్చుకోవచ్చు. పైకి మార్చుకునేందుకు ఓ బటన్, తిరిగి కిందకి మార్చేందుకు ఓ బటన్ ఉంటాయి. వాటిని నొక్కితే చాలు గేర్లు వాటంతట అవే మారిపోతాయి.   

ఇక కొత్తగా రూపొందించబోయే బైక్ లో క్లచ్ లేకపోవటం వల్ల 5 శాతం దాకా ఇంధనాన్ని ఆదా చేసే అవకాశం ఉంటుందని సంస్థ చెబుతోంది. అంతేకాదు బాగా ట్రాఫిక్ ఉన్న నగరాల్లో వాహనదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. అపాచీ మోడళ్లలో ఈ సెమీ ఆటోమేటెడ్ టెక్నాలజీని వాడనున్నట్లు తెలిపారు. అతి త్వరలో ఈ క్లచ్ లు లేని బైకులు మార్కెట్లోకి దించేందుకు టీవీఎస్ సన్నాహాలు చేస్తోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : clutch less bike  TVS  Semi Automated technology  

Other Articles